వారణాసి సమీపంలోని సిద్ధేశ్వరి మందిర్ ప్రాంగణంలో చంద్రుడు నిర్మించిన చంద్రకూప్ అనే బావి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. పురాణాల ప్రకారం ఎవరైనా ఈ బావిలోకి చూస్తే వారి ప్రతిబింబం కనిపించకపోతే రాబోయే ఆరు నెలల్లో జీవితం ముగుస్తుందని స్థానికులు చెబుతుంటారు
వారణాసి(Varanasi).. అధ్యాత్మికతతో నిండిన ఇక్కడ ఎన్నో పురాతన ఆలయాలున్నాయి. ప్రతి హిందువు తన జీవితంలో ఒక్కసారి అయిన వారణాసిని దర్శనం చేసుకోవాలని చెబుతుంటారు. కాశీలో మరణించిన వారికి మోక్షం లభిస్తుందని చెబుతుంటారు పెద్దలు. అయితే ఇక్కడే మరణాన్ని ముందే చెప్పే బావి ఓ గురించి తెలుసుకుందాం.
కాశీ విశ్వనాథ ఆలయానికి సమీపంలోని సిద్ధేశ్వరి మందిర్ ప్రాంగణంలో చంద్రుడు నిర్మించిన చంద్రకూప్ (Chandrakoop) అనే ఈ బావి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ బావి నీటి కోసమే కాకుండా రాబోయే మరణాన్ని కూడా వెల్లడిస్తుందని భక్తులు నమ్ముతారు. పురాణాల ప్రకారం ఎవరైనా ఈ బావిలోకి చూస్తే వారి ప్రతిబింబం కనిపించకపోతే రాబోయే రాబోయే ఆరు నెలల్లో జీవితం ముగుస్తుందని, ఇది ఒక శకునమని చెబుతుంటారు. అందుకే దీనిని భవిష్యత్తు అంచనా వేసే బావి అని కూడా పిలుస్తారు.
శివుని భక్తుడైన చంద్ర దేవుడు
‘చంద్రకూప్’ అనే పేరు రెండు పదాలతో ఈ బావి నిర్మించబడింది. ‘చంద్ర’ అంటే చంద్రుడు, ‘కూప్’ అంటే బావి. హిందూ పురాణాల ప్రకారం, ఈ బావిని శివుని భక్తుడైన చంద్ర దేవుడు నిర్మించాడు. చంద్రదేవుని తపస్సుకు సంతోషించిన శివుడు ఈ బావికి ప్రత్యేక శక్తులను ప్రసాదించాడని నమ్ముతారు. ఈ బావిలోకి చూస్తేనే వ్యక్తి మనస్సు, శరీరం, ఆత్మ శుద్ధి అవుతాయని స్థానిక ప్రజలు నమ్ముతారు. హిందూ పురాణాల ప్రకారం చంద్రేశ్వర లింగం నవగ్రహ శివలింగాలలో ఇది తొమ్మివది. పౌర్ణమి, అమావాస్య రోజులలో ఎక్కువగా భక్తులు ఇక్కడ పూజలు చేస్తుంటారు. ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఈ ఆలయాన్ని భక్తులు సందర్శించవచ్చు. ఈ బావిలో ఉన్న మరో ప్రత్యేక విషయం ఏమిటంటే, వారణాసిలోని మణికర్ణికా ఘాట్‌తో దీనికి ఉన్న సంబంధం ఉంది. ఈ బావి లోపల మణికర్ణిక ఘాట్ నుండి నేరుగా వెళ్ళే సొరంగం ఉందని స్థానిక పూజారి చెబుతున్నారు.
Also read
- ఎంత కష్టమొచ్చిందో.. పురుగుల మందు తాగి అక్క చెల్లెలు …
- Marriages : ముగ్గురు భార్యలు జంప్.. నాలుగో పెళ్లికి రెడీ.. నీ కష్టం పగోడికి కూడా రావొద్దురా!
- ఇంగ్లీష్ టీచర్ వేధిస్తోంది.. మండుటెండలో కేజీబీవీ విద్యార్థినుల ధర్నా
- తాగుబోతు దాష్టీకం.. తాగి గొడవ చేస్తున్నాడని చెప్పినందుకు మహిళపై దారుణం..
- Kuja Dosha Remedies: జాతకంలో కుజ దోషమా.. లక్షణాలు, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నివారణలు ఏమిటంటే