ముఖ్యమంత్రి చంద్రబాబు మాట ఇస్తే కచ్చితంగా నెరవేరుస్తారని లబ్ధిదారుల్లో ఉన్న నమ్మకం మరోసారి ఆచరణలో నిరూపితమైంది.
గుడివాడ పట్టణం రామబ్రహ్మం పార్కులోని అన్న క్యాంటీన్ న్ను ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం పునః ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కృష్ణా జిల్లా గుడివాడ మండలం వలివర్తిపాడుకు చెందిన ఆటో డ్రైవర్ రేమల్లి రజినీకాంత్ మాట్లాడించగా ఆటో నడుపుతూ తన ఇద్దరు పిల్లలనూ ఉన్నత విద్య చదివిస్తున్నానని తెలిపారు. అతని కొడుకు రవితేజ మాట్లాడుతూ తాను ఇంజినీరింగ్ పూర్తి చేసి ప్రైవేటు ఉద్యోగం చేస్తూ తన చెల్లి బీడీఎస్ చదువుకు చేదోడుగా నిలుస్తున్నానని చెప్పారు.
ఈ క్రమంలో ఆడపిల్ల చదువు కష్టం కాకూడదని, రజినీకాంత్ కు విద్యుత్ తో నడిచే ఆటో సమకూరుస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ మేరకు గంటల వ్యవధిలో రూ.3.9 లక్షల విలువైన ఎలక్ట్రిక్ ఆటోను అందించారు. కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశాలతో ఆర్టీవో నిమ్మగడ్డ శ్రీనివాస్ గురువారం రాత్రి ‘అపే ఈసిటీ’ ఆటో తీసుకురాగా గుడివాడ మున్సిపల్ కమిషనర్ జి. బాలసుబ్రమణ్యం, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు రజినీకాంత్ కు ఆటో తాళాలు అందజేశారు.
*చంద్రబాబుకు రుణపడి ఉంటాం: ఆటో డ్రైవర్ రజినీకాంత్*
‘నా జీవితంలో చాలా మంది నేతలను చూశాను. కానీ చంద్రబాబు లాంటి నేతను ఎన్నడూ ఇంత దగ్గరగా చూడలేదు. ఆయన రుణం తీర్చుకోలేము. ఆయన చేసిన మేలును మా కుటుంబం ఎప్పుడూ మరచిపోదు. గంటల వ్యవధిలో ఎలక్ట్రిక్ ఆటో సమకూర్చడం నమ్మలేకపోతున్నాను’ అని రజినీ కాంత్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
Also read
- నేటి జాతకములు 22 నవంబర్, 2024
- తెలంగాణ : అయ్యో..పాపం..వీళ్లు బంధువాలా.. రాబందువులా?.. ఆస్తిని కాజేసి చివరికి..
- ఈ ఆంజనేయ స్వామి కొండ ఎక్కితే.. పచ్చగా మారుతున్న భక్తులు
- చెల్లి ఫొటోతో ఎఫ్బీ అకౌంట్..యువకుడి నుంచి కోట్లువసూలు, ట్విస్ట్ సూపర్
- అమ్మాయితో మాట్లాడాడని ఇంటర్ విద్యార్థిపై దాష్టీకం కోనసీమలో నలుగురు యువకుల దౌర్జన్యం