హైదరాబాద్: పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను లోబరుచుకుని తన వద్ద రూ.30 లక్షలకు పైగా వాడుకుని మోసంచేసిన విజయనగరం పట్టణానికి చెందిన బొబ్బిలి సాయికిరణ్‌ను తక్షణమే అరెస్టుచేసి శిక్షించాలని బాధితురాలు ప్రభుత్వానికి విజ్ఞప్తిచేసింది. హైదరాబాద్ ప్రెసైక్లబ్లో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రెండేళ్ల క్రితం తాను ఉద్యో గం నిమిత్తం చెన్నై వెళ్లగా సాయికిరణ్ పరిచయమయ్యాడని చెప్పింది.
తనకు పెళ్లయి ఒక కూతురు ఉందని, భర్తతో వేరుగా ఉంటున్నానని చెప్పినా పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా తనను లోబరుచుకున్నాడని ఆరోపించింది. 2 ఏళ్లు మణికొండలో లివింగ్ రిలేషన్షిప్లో ఉండి తన నుంచి రూ.30 లక్షలకు పైగా తీసుకు న్నాడని బాధితురాలు తెలిపింది. ఆర్నెళ్లుగా వేరే మహిళతో సన్నిహితంగా ఉంటున్నాడని, ప్రశ్నించడంతో చంపేస్తానని బెదిరించాడని వాపోయింది. సాయికిరణ్‌ను అరెస్టుచేసి న్యాయం చేయాలని బాధితురాలు విజ్ఞప్తి చేసింది.
Also read
- నేటి జాతకములు 26 సెప్టెంబర్, 2026
- అన్నను స్కూల్ బస్సు ఎక్కించేందుకు తల్లి వెంటే వచ్చి.. అదే బస్సు కిందపడి మూడేళ్ల బాలుడు మృతి!
- వేడి సాంబార్లో పడి మహిళ మృతి.. సీసీ కెమెరాలో షాకింగ్ దృశ్యాలు!
- విష్ణుమూర్తి నాభి నుంచే పద్మం ఎందుకు పుట్టింది? బ్రహ్మదేవుడి ఆవిర్భావం వెనుక అసలు రహస్యం ఇదే!
- దుర్ముహూర్తం అంటే ఏమిటి? ఈ సమయంలో శుభకార్యాలు ఎందుకు చేయరు? కారణం ఇదే!





