SGSTV NEWS online
Crime

మేడ్చల్‌లో పట్టపగలే దారుణ హత్య.. కత్తులతో నరికి


మేడ్చల్‌లో బస్ డిపో ముందు ఆదివారం దారుణ హత్య జరిగింది. ఉమేశ్ అనే వ్యక్తిని సోదరులే నడిరోడ్డుపై కత్తులతో నరికి చంపారు. హత్యకు కుంటుంబ తగాదాలే కారణమని తెలుస్తోంది. హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యారు దుండగులు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే వ్యక్తి దారుణ హత్యకు గురైయ్యాడు. అన్నదమ్ములే అతని పాలిట కాలయముడిలా మారారు. ఈ ఘటన మేడ్చల్‌ నగర శివారులోని బస్‌ డిపో దగ్గర ఆదివారం చోటుచేసుకుంది. నడిరోడ్డుపై ఉమేశ్‌ను కత్తులతో నరికి సోదరులు హత్య చేశారు

ఉమేశ్‌ను కింద పడేసి కత్తులతో పొడిచి పొడిచి చంపేశారు. హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యారు దుండగులు. కుటుంబ కలహాలతోనే ఉమేశ్ హత్యకు కారమని తెలుస్తోంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also read

Related posts