SGSTV NEWS online
Andhra PradeshCrime

కూటమి ప్రభుత్వంలో బ్రాహ్మణ ఉద్యోగి ఆత్మహత్య/హత్యా… కారకులు/ప్రేరేపకులు ఎవరు…?? ఈ పాపం ఎవరికి చుట్టుకుంటుంది..??

Palakollu: యలమంచిలి మండలంలో చించినాడ బ్రిడ్జి పై నుండి గోదావరిలో దూకి/ నెట్టి వేసి గల్లంతయిన గొర్తి శ్రీనివాసరావు(43) డా. బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండ గ్రామానికి చెందిన వ్యక్తి. విజయవాడలో బ్రాహ్మణ క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ ఉద్యోగి గా శ్రీనివాస్ పనిచేస్తున్నాడు.బ్రిడ్జిపై నుండి గోదావరిలో దుకాడని సొసైటీ అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన యలమంచిలి పోలీసులు. గల్లంతైన వ్యక్తి కోసం గజ ఈతగాళ్ల సాయంతో పోలీసులు గాలింపు చేపట్టారు. అతను కావాలని దూకాడా… వీళ్ళ డబ్బులు స్కాం బయటపడుతుందని వీళ్ళే గోదావరి నదిలో తోసివేశారా ఈ బ్రిడ్జి నుంచి…
ఈ ఆత్మహత్య/హత్యకు,  తన ఆత్మహత్య/హత్య నోట్ రాసిన ప్రకారం కారకులు/ప్రేరేపకులు ఈ కూటమి ప్రభుత్వంలో ఎవరయ్యా అంటే ఎపి బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించిన బొచ్చు రాంప్రసాద్, ప్రభుత్వం సర్వీస్ రూల్స్ విరుద్ధంగా పనిచేస్తున్న బ్రాహ్మణ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సీఈవో నాగసాయి, దేవాదాయ శాఖ నుండి బ్రాహ్మణ  కార్పొరేషన్ ఎండి గా చేస్తున్న చంద్రశేఖర్ ఆజాద్, గొల్లపూడి సొసైటీ హెడ్ ఆఫీసులో పనిచేసే త్రిపుర సుందరి లే ఈ ఆత్మహత్య/హత్యకు కారణం…

సూసైడ్ వాట్సాప్ మెసేజ్

వీళ్లు అందరూ దొంగలే… వీళ్ళ గత ట్రాక్ రికార్డు, వారికున్న కేసులు,శిక్షలు గురించి విచారణ చేస్తే ప్రభుత్వానికి పూర్తిగా అవగతమవుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఐ వై ఆర్ కృష్ణారావు గారు పేద బ్రాహ్మణ సంక్షేమం కోసం 2017- 2018లో ఎపి బ్రాహ్మణ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీని స్థాపించారు. అప్పటినుండి ఈ సొసైటీలో స్కామ్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటి కూటమి,అప్పటి ప్రభుత్వంలో ఈ దొంగలు దొంగలు కలసి బ్రాహ్మణులు దాచిపెట్టుకున్న సొమ్మును మరియు అప్పటి cbn గారి ప్రభుత్వం బడ్జెట్ ద్వారా కేటాయించిన డబ్బులు కాజేస్తూనే ఉన్నారు.. ఈ కూటమి ప్రభుత్వానికి  స్వయంగా చాలామంది, బ్రాహ్మణ సంఘాలు చాలాసార్లు రాత పూర్వక ఫిర్యాదులు చేశారు.. దానికి ఈ కూటమి ప్రభుత్వం ఈ సీఈఓ నాగసాయిని 3 సార్లు ప్రభుత్వం జీవో లు ఇచ్చి మరి ట్రాన్స్ఫర్ చేస్తే…అతను రోజుల్లోనే ప్రభుత్వానికి చాలెంజ్ విసిరి రిలీవ్ కాకుండానే మళ్లీ కొత్తగా ceo గా ఉద్యోగంలో చేరేవాడు… ఈ సొసైటీ సీఈఓ కు  ట్రాన్స్ఫర్ కాగానే బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఇప్పటివరకు govt ద్వారా ఇచ్చిన  జీవోలను తన పలుకుబడితో రద్దు చేయించి మరలా 3 సార్లు ఫ్రెష్ జీవో లు ఇప్పించి మరి ఈ సీఈఓ నాగసాయిని సొసైటీలో ట్రాన్స్ఫర్ కాకుండా ఆపించుకున్నాడు. దేనికోసం అనేది మీకు అర్థం అయితే అర్థం అయినంత..😜🤣💰… అందులో పని చేసే సీఈవో గత జగన్ ప్రభుత్వంలో మల్లాది విష్ణుకి, కోన రఘుపతి కి ఈ ప్రభుత్వ సోసైటీ ద్వారా 💰💰💰లు ఇచ్చి తన ceo పదవి కాపాడుకున్నాడు.. ఆ విషయాలు అన్ని ఈ కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన సరే కూటమి చైర్మన్ బొచ్చు రామ్ ప్రసాద్ అతనికి అండగా ఉండి💰💰💰తీసుకొని సొసైటీలో దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. ఇది అసలు కథ…

గత ప్రభుత్వంలో ఈ సొసైటీకి ప్రభుత్వ చట్ట బైలాల ప్రకారం మహాజన సమావేశం ద్వారా ఎన్నికల నిర్వహించకుండా, 75 వేల మంది సభ్యులకు కనీస నోటీసులు కూడా ఇవ్వకుండా జిల్లాల వారీగా వైసిపి నకిలీ సెలక్షన్ ఎన్నికలు నిర్వహిస్తుంటే 2021-22లో హైకోర్టులో బ్రాహ్మణ చైతన్య వేదిక రిట్లు వేస్తే కోర్ట్ కి సమాధానాలు చెప్పకుండా ఎన్నికలు ఆపివేశాడు ఇదే ceo నాగసాయి… నేటికీ ఆ కేసులు హైకోర్టులో పెండింగ్లో ఉన్నాయి..

ప్రభుత్వంతో ఆడిట్ చేయించకుండా 2017- 2026 నేటి వరకు తప్పుడు లెక్కలతో ప్రైవేటు ఏజెన్సీలతో ఆడిట్ చేయిస్తూ డబ్బులు విపరీతంగా మెక్కేస్తున్నారు… వీళ్లు ప్రభుత్వాలను కూడా మేనేజ్ చేసే పరిస్థితి ఉందంటే ఈ కూటమి ప్రభుత్వం లో ఇంకా ఎవరేం చేస్తారు సార్…

అందులో ఇది చాలా *అతి మంచి ప్రభుత్వం✌️* కదా…🙏🙏

ఇదే యదార్థం.. ఇదే వాస్తవం… ఈ కూటమి ప్రభుత్వంకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే క్షుణ్ణంగా అన్ని విచారిస్తేనే ఇలాంటివి ఎన్నో అవినీతి విషయాలు కుప్పలు కుప్పలుగా బయటకు వస్తాయి…!!! బాధ్యుల పైన చట్టప్రకారం చర్యలు తీసుకుంటే బ్రాహ్మణ సమాజం ప్రభుత్వ చర్యలను హరిస్తుంది.. అండగా ఉంటుంది.

ఈ అవినీతి పాపానికి ఓ నిండు బ్రాహ్మణ కుటుంబం అయితే కూటమి ప్రభుత్వంలో పూర్తిగా బలైపోయింది… ఇప్పటికైనా సరే నిజమైన దోషులెవరో గుర్తించి తగిన శిక్ష కనుక ప్రభుత్వం వెయ్యకపోతే.. అష్టదిక్పాలకులు, పంచభూతాలు మిమ్మల్ని, మీ పాలనను చూస్తూనే ఉన్నాయి.. వాటి ద్వారా అయితే అందరికీ శిక్ష తప్పదు… కర్మ అనేది రిటర్న్ గిఫ్ట్ గ్యారంటీగా అయితే ఇస్తుంది…🙏🙏

*బాధిత బ్రాహ్మణ సమాజం*

Also read

Related posts