నందివాడ: కృష్ణా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నందివాడ మండలం పెదలింగాలలో పదేళ్ల బాలుడిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. నానమ్మ లక్ష్మి (70)తో కలిసి బాలుడు బాలాజీ ఇంట్లో నిద్రిస్తుండగా దుండగులు దాడికి పాల్పడ్డారు. దీంతో బాలాజీ మృతిచెందగా.. వృద్ధురాలు లక్ష్మికి తీవ్రగాయాలయ్యా ఆమె విజయవాడలోని ఓ ఆస్పత్రికి తరలించారు.
ప్రస్తుతం వృద్ధురాలి పరిస్థితి విషమంగా ఉంది. నందివాడ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. సిమెంట్ రాళ్లతో ఇరువురినీ బలంగా కొట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలుడు, వృద్ధురాలిపై దాడికి గల కారణాలు తెలియరాలేదు.
Also read
- ఆలయంలో ప్రీ-వెడ్డింగ్ షూట్ వివాదం : కెమెరామెన్ పై దాడి
- మహిళపై అసభ్య ప్రవర్తన.. ప్రశ్నించిన కుమారుడి దారుణ హత్య
- గుంటూరు జీజీహెచ్ నుంచి రిమాండ్ ఖైదీ పరారీ
- భార్యతో గొడవ.. అడొచ్చిన అత్తను చంపిన అల్లుడు
- కృష్ణా జిల్లాలో బాలుడి హత్య.. నానమ్మకు తీవ్రగాయాలు





