ఏలూరు జిల్లా : నూజివీడు మండలం : మర్రి బంధం :
▪️ *పద్మావతి – పద్దు* ▪️
*నీ పద్దు లో – ఎంత మంది బాధితులు..❓*
*నీ – పద్దు – చిట్టా – చూడతరమా*❓
*మర్రిబంధం లో వెలసిన మరో తారా చౌదరి*
*దావులూరి పద్మావతిపై రౌడీషీట్*
*దావులూరి పద్మావతి వుచ్చు లో బాధితులు ఎంతోమంది..!!*
*బ్లాక్మెయిలింగ్ …హనీ ట్రాప్… 11 కేసులు …లక్షల్లో మోసగించడం… బంగారం ,డబ్బు దోచుకోవడం.. బెదిరింపులు.. తన నేర ప్రవృత్తి..*
వివరాల్లోకి వెళితే..
నూజివీడు మండలంలోని మర్రిబంధం గ్రామానికి చెందిన మాజీ బ్యాంకు ఉద్యోగిని దావులూరి పద్మావతిపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఈమె ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగినిగా పనిచేస్తూ సీతారాంపురం గ్రామానికి చెందిన కవులూరి యోగి అనే వ్యక్తికి చెందిన బంగారు ఆభరణాలను బ్యాంకులో తాకట్టు పెట్టగా, వాటిని సదరు వ్యక్తికి తెలియకుండానే బ్యాంకు నుండి విడిపించుకోవడంతో వారి మధ్య వివాదం తలెత్తింది. దీంతో దావులూరి పద్మావతిపై ఆమె బంధువులు సైతం తమను మోసగించిందని, తమ బంగారం, ఇంటి స్థలం, లక్షల్లో నగదును సైతం కాజేసిందంటూ నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆమెపై దాదాపు 6 కేసులు నమోదు కాగా, కాలంలో రౌడీ షీట్ కూడా తెరిచినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు దావులూరి పద్మావతిపై 11 కేసులు నమోదయ్యాయి.
బంధువులను సైతం తనకు అడ్డువస్తే చంపివేస్తానంటూ బెదిరింపులకు పాల్పడటంతో బాధితులు పలుమార్లు నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. ఇదిలా ఉండగా ఒక ప్రముఖ ఛానల్ లో దావులూరి పద్మావతి చేసిన ఆరోపణలు సంచలనం రేకెత్తించాయి. వైసిపి నాయకుడు కవులూరి యోగి ఆమెను మోసగించాడని, అన్ని విధాల వాడుకుని, తనపై అక్రమ కేసులు బనాయిస్తున్నాడంటూ ఆరోపణలు చేయడంతో సదరు వైసిపి నాయకుడు కవులూరు యోగి మీడియాను ఆశ్రయించారు.
గతంలో పెనమలూరు మండలం గంగూరు గ్రామంలో బ్యాంకు మేనేజర్ గా పనిచేసినప్పుడు దావులూరి ప్రభావతి పేరిట 386 బంగారం తాకట్టు పెట్టడం జరిగిందని, తనకు తెలియకుండా ఆమె ఆ బంగారాన్ని విడిపించుకోవడంతో ఆమెపై పోలీస్ స్టేషన్లో చేయడం జరిగిందన్నారు. ఆమెతో నేను సహజీవనం చేశానని, అన్ని విధాలుగా వాడుకున్న ప్రభావతి నన్ను మోసగించడంతో ఆమెను వదిలించుకున్నట్లు యోగి తెలిపారు. గతంలో ప్రభావతి ఎందరినో మోసగించి లక్షలాది రూపాయలు స్వాహా చేసినట్లు యోగి ఆరోపించారు. అందుకు సంబంధించిన ఆధారాలు అన్ని తన వద్ద ఉన్నాయన్నారు. తాను వైసిపి ప్రభుత్వంలో అధికారులను, ప్రజా ప్రతినిధులను అడ్డుపెట్టుకొని ఎన్నడు మోసాలకు పాల్పడలేదన్నారు. ప్రభావతి తనపై అత్యాచారం చేశాడంటూ, కొందరు వైసిపి ఎమ్మెల్యేల మద్దతుతో తనపై అక్రమ కేసులు పెట్టించిందని ఆరోపించారు. దావులూరి ప్రభావతి తనతో పాటు అనేక ప్రాంతాల్లో ప్రయాణించడంతోపాటు హోటల్స్ లో కూడా బస చేసామని, ఏ సంబంధం లేకుండా తనతో ఎందుకు తిరిగిందంటూ యోగి ప్రశ్నించారు. ప్రభావతి చేష్టలు మన ఆంధ్రాలో మరో తారా చౌదరిని గుర్తుకి తెస్తున్నాయన్నారు. ప్రభావతి ఒక హనీట్రాపర్ అని, ఎంతమందిని మోసం చేసిందో తన వద్ద ఆధారాలు ఉన్నాయని యోగి మీడియాకు తెలిపారు. తన వద్ద ఉన్న ఆధారాలు అవాస్తవమని తేలితే తాను చట్ట పరంగా ఎలాంటి శిక్షకైనా సిద్ధమన్నారు. ఈ సందర్భంగా ఆయన తన వద్ద ఉన్న కొన్ని ఆధారాలను మీడియాకు చూపించారు.
Also read
- ప్రతిరోజూ పెళ్లి చేసుకొనే స్వామిని సందర్శిస్తే మీకు కూడా వివాహం
- Telangana: ఇదెక్కడి యవ్వారం.. గాజుల పండక్కి పిలవలేదని.. ఏకంగా కోర్టుకెళ్లిన మహిళ.. ఎక్కడంటే?
- Andhra: పెట్రోల్ కొట్టించేందుకు బంక్కొచ్చిన కానిస్టేబుల్.. ఆపై కాసేపటికే తోపునంటూ..
- Fake DSP: ఉద్యోగాల పేరుతో యువకులకు ఎరా.. తీగలాగితే కదులుతున్న నకిలీ డీఎస్పీ దందా!
- Tuni: తండ్రి మరణంపై నారాయణరావు కుమారుడు రియాక్షన్ వైరల్.. అనూహ్య రీతిలో





