నిడదవోలు ఐ లవ్ యూ నిడదవోలు ( గణపతి సెంటర్) నందు , ఇందిరా నగర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మరియు శెట్టి పేట లో ఇఫ్టు స్థూపం వద్ద కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్ ల అమలు కు నిరసనగా నిర్వహించిన బ్లాక్ డే కార్యక్రమం.
ఈ సందర్భంగా ఐ.యఫ్.టి.యు రాష్ట్ర కమిటీ సభ్యులు ఈమని గ్రీష్మ కుమార్ మాట్లాడుతూ కేంద్రం లోని మోడి ప్రభుత్వం కార్పొరేట్ ల ప్రయోజనాలు కోసం కార్మిక వర్గం బ్రిటిష్ కాలంనుండి అనుభవిస్తున్న 8 గంటల పని, సంఘం ఏర్పాటు చేసుకునే హక్కు, కనీసం వేతనాలు, బోనస్, పి.యఫ్ తదితరాలను పెట్టుబడి దారులకు అనుకూలంగా మార్చివేసిందనీ, కార్మికులు మరియు యాజమాన్యాల మధ్య మధ్యవర్తులుగా వ్యవహరించాల్సిన లేబర్ అధికారులను పెట్టుబడి దారులకు ఫెసిలిటేటర్స్ గా మార్చి వేసిందనీ, తద్వారా కార్మికులను పెట్టుబడి దారులకు కట్టుబానిసలుగా మారుస్తూ 4 లేబర్ కోడ్ ల అమలు కు పూనుకుంటోందనీ తక్షణమే 4 లేబర్ కోడ్ లు రద్దు చేయాలని, శతాబ్దాల నాటి కార్మిక చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
గణపతి సెంటర్ లో జరిగిన కార్యక్రమంలో ఇఫ్టు నాయకులు ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు కోనేటి మల్లేశ్వర రావు, మల్లిడి రామిరెడ్డి, పిచ్చా సూర్య కిరణ్, లంకాడ గణపతి, నాగరాజు,చొక్కా కుల సత్తిబాబు, సుబ్బారావు, తదితరులు నాయకత్వం వహించారు.
ఇందిరా నగర్ లో అభ్యుదయ పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బ్లాక్ డే కార్యక్రమం లో రవ్వ సురేష్ కుమార్, పులుగు చైతన్య, నంది గోళ్ళ మహేష్, వై. రాజ్ పాల్, యాదాల రమణ, గుంటు సూరిబాబు తదితరులు నాయకత్వం వహించారు.
శెట్టి పేట లో ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బ్లాక్ డే కార్యక్రమం లో ప్రెసిడెంట్ ఖండవల్లి వీర వెంకట రావు, పాఠం శెట్టి రాజేష్, వరహాల స్వామి, సారె శ్రీనివాస్, కందాళ సాయి తదితరులు నాయకత్వం వహించారు.
Also read
- Kurnool: నాన్న వచ్చి బాగోగులు చెప్పి వెళ్లాడు.. కానీ బాలుడిలో మనసులో ఏదో వేదన.. దీంతో..
- Vastu Tips: సూర్యాస్తమయం తర్వాత ఇల్లు ఊడ్చడం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుందా? నిజమిదే
- Yogini Ekadashi: యోగిని ఏకాదశి ఎప్పుడు? పాప విముక్తిని ప్రసాదించే మహా వ్రతం.. ఈ పురాణ కథ తెలుసా?
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- Garuda Purana: గరుడ పురాణం హెచ్చరిక.. ఈ 5 రకాల వ్యక్తులతో ఉంటే కష్టాలు, అపజయాలు తప్పవట!





