దుగ్గొండి: క్రెడిట్ కార్డులపై తీసుకు న్న రుణం చెల్లించాలని బ్యాంకర్లు వేధించడంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన వరంగ ల్ జిల్లా నాచినపల్లిలో ఆదివారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. నాచినపల్లికి చెందిన దార ప్రసాద్ (35) కాకతీయ వర్సిటీలో డిగ్రీ పూర్తి చేసిన అనంతరం హైదరాబాద్ లోని ఓ షాపింగ్మాల్లో పనిచేశాడు. ఈ క్రమంలోనే వివిధ బ్యాంకులకు చెందిన 10 క్రెడిట్ కార్డులు తీసుకున్నాడు.
వాటి ద్వారా రుణం తీసుకొని హైదరాబాద్లోనే చిట్టీ వేశాడు. చిట్ఫండ్ కంపెనీ దివాలా తీయడంతో ఆ డబ్బులు రాలేదు. దీంతో క్రెడిట్ కార్డుల కిస్తీ లు చెల్లించలేక ఆరు నెలల క్రితం ఉద్యోగం మానేసి ఇంటికి వచ్చాడు. అప్పటి నుంచి ఆయా బ్యాంకుల రికవరీ బృందా లు నాచినపల్లికి వచ్చి ప్రసాద్ను నిలదీయగా, ఈ నెల 19న చెల్లిస్తానని చెప్పాడు. వాయిదా సమయం రావడం.. డబ్బు చేతిలో లేక భయపడి ఇంట్లో ఉరివేసుకున్నాడు. ప్రసాద్ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025