చీటింగ్ కేసులో అరెస్టైన అఘోరీకి సంగారెడ్డి జైలు అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు. ఆడా, మగా తేలకుండా ఏ బ్యారక్‌లో ఉంచలేమన్నారు. దీంతో లింగనిర్ధారణ పరీక్షలు చేయించాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. పరీక్షల తర్వాత చంచల్ గూడ జైలుకు తరలించే అవకాశం ఉంది
ఉత్తరప్రదేశ్ సరిహద్దులో అదుపులోకి
ఇదిలా ఉంటే.. లేడీ అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్ పోలీసులకు చిక్కాడు. వర్షిణీని పెళ్లి చేసుకుని కనిపించకుండా పోయిన అఘోరీని పోలీసులు మంగళవారం సాయంత్రం మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నార్సింగి పోలీస్ స్టేషన్ కి తరలించారు. అక్కడ నుంచి చేవెళ్ల కోర్టుకు తీసుకెళ్లారు.
విచారణలో భాగంగా లేడీ అఘోరీకి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆమెను సంగారెడ్డి సబ్ జైలుకు తరలించారు. అదే సమయంలో శ్రీనివాస్ నుంచి వర్షిణీని వేరు చేసిన పోలీసులు భరోసా సెంటర్‌కు పంపించారు. అక్కడ వర్షిణీకి భరోసా సెంటర్ అధికారులు కౌన్సిలింగ్ ఇవ్వనున్నారు. ఇదే విషయంపై అఘోరీ తరఫు లాయర్ మాట్లాడుతూ.. ‘‘కోర్టులో ఇప్పుడు వాదోపవాదనలు ఏం జరగలేదు. కోర్టు కేవలం 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. కేసుకు సంబంధించి పూర్వపరాలు పరిశీలించి కేసు వాదించాలా లేదా అనేది జరుగుతుంది. కోర్టు తరఫున అడ్వకేట్‌ను పెట్టుకునే స్థోమత లేనివారికి కోర్టు నన్ను అపాయింట్ చేసింది. బెయిల్ గురించి ఇప్పుడే చెప్పలేం. కేసుకు సంబంధించి అన్నీ పరిశీలించిన తర్వాత ఒక టైం పడుతుంది. ’’ అని చెప్పుకొచ్చారు.
Also read
- Vijayawada:పోలీస్ ల నుండి తప్పించుకునేందుకు.. అపార్ట్మెంట్ పైనుంచి దూకేసిన యువకుడు
- Guntur: కాల్ బాయ్‌గా చేస్తే సూపర్ ఇన్‌కం.. టెమ్ట్ అయి కమిటయిన కొందరు.. ఆ తర్వాత
- Hyderabad: చదువుకోమని తల్లి మందలించిందని..
- Crime News: కరీంనగర్లో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై వీడియో తీసి..
- BIG BREAKING: తెనాలిలో కలకలం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య!