SGSTV NEWS online
CrimeNational

Bengaluru: లైంగిక వాంఛ తీర్చలేదని హత్య.. మహిళా టెకీ మృతి కేసులో మలుపు

బెంగళూరు: చిరుప్రాయంలోనే ఆ యువకుడి ఆలోచనలు అదుపు తప్పాయి. పక్కింటి యువతిని ఆరాధించి, ప్రేమించి, ఆమె ఒంటరిగా ఉన్నవేళ వయస్సుకు మించిన కోర్కెలతో అఘాయిత్యానికి తెగించాడు. ఆమె ప్రతిఘటించడంతో చివరకు హత్య చేసి, ఆధారాలు చెరిపేసేందుకు ఇంటికే మంటపెట్టాడు. ఆమె అగ్ని ప్రమాదంలో మరణించినట్లుగా తొలుత భావించినప్పటికీ.. పోస్టుమార్టం నివేదిక, సాంకేతిక ఆధారాలతో యువకుడి పాత్ర బయటపడింది.

బెంగళూరులో జరిగిన ఈ దారుణంపై పోలీసుల కథనం.. కర్ణాటకలోని మంగళూరుకు చెందిన షర్మిల కుశాలప్ప (34) బెంగళూరులోని ఓ సాఫ్ట్వేర్ సంస్థలో ఇంజినీర్ గా పని చేసేవారు. రామ్మూర్తినగర ఠాణా పరిధి సుబ్రహ్మణ్య లేఅవుట్లోని ఓ ఫ్లాట్లో తన స్నేహితుడితో కలిసి ఉండేవారు. ఈనెల 3న షర్మిల ఒంటరిగా ఉన్నవేళ ఫ్లాట్లో ఆకస్మికంగా మంటలు చెలరేగగా, ఆమె మరణించినట్లు ఫిర్యాదు అందింది. పోలీసులూ ఆ కోణంలోనే దర్యాప్తు చేపట్టారు. అయితే, ఇది సాధారణ మరణం కాదని ఫోరెన్సిక్ నివేదికలో తేలింది. ఆమెమరణించినట్లు ఫిర్యాదు అందింది. పోలీసులూ ఆ కోణంలోనే దర్యాప్తు చేపట్టారు. అయితే, ఇది సాధారణ మరణం కాదని ఫోరెన్సిక్ నివేదికలో తేలింది. ఆమె శరీరానికి నిప్పు అంటుకోకముందే చేతిపై గాయాలయ్యాయని, ఆపై ఊపిరాడక చనిపోయినట్లు వైద్యులు తేల్చారు. దీంతో పోలీసులు అక్కడి సీసీ కెమెరాల ఫుటేజ్ లు సేకరించారు. ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించారు.

ఆధారాల్లేకుండా ఇంటికే మంటలు

షర్మిల, ఆమె మిత్రుడు ఉండే ఫ్లాట్ పక్కనే కొడగు జిల్లా విరాజ్పేటెకు చెందిన ఇంటర్ సెకండియర్ విద్యార్థి కర్నల్ కురై (18) తల్లితో కలిసి ఉంటున్నాడు. ఈ నెల 3న షర్మిల స్నేహితుడు ఇంట్లో లేని సమయంలో కురై ఆమె ఉండే గదిలోకి కిటికీలోంచి దూరాడు. లైంగిక కోర్కె తీర్చాలని ఒత్తిడి తేవడంతో షర్మిల గట్టిగా అరుస్తూ తోసివేశారు. కోపం పట్టలేని ఆ యువకుడు.. వంటగదిలోని కత్తితో ఆమెపై దాడి చేశాడు. ఆమె పరుపుపై పడిపోగా, మరోసారి కొట్టాడు. అరవొద్దంటూ నోటిని దిండుతో గట్టిగా మూయడంతో షర్మిల ఊపిరాడక చనిపోయారు.

ఆపై సాక్ష్యాలను నాశనం చేసేందుకు రక్తపు మరకలున్న ఆమె దుస్తుల్ని తీసి, అదే గదిలో నిప్పంటించి కాల్చేశాడు. మంటలు వ్యాపించడంతో అక్కడి నుంచి పారిపోయేందుకు మళ్లీ కిటికీలోంచి దూకేశాడు. ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించి ఆమె మరణించిందని, సహజ మరణంగా చూపేందుకు ఇలా చేసినట్లు నిందితుడు పోలీసుల విచారణలో అంగీకరించాడు. షర్మిల సెల్ఫోన్లోని వివరాలు ఈ కేసు దర్యాప్తునకు ఉపకరించాయి. మృతురాలి స్నేహితుడి ఫిర్యాదు మేరకు  పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Also Read

Related posts