SGSTV NEWS
CrimeTelangana

TG News: వివాహేతర సంబంధం .. రిసార్ట్‌లో బావ, మరదలు ఆత్మహత్య!


యాదాద్రి భువనగిరి జిల్లా రాగాల రిసార్ట్స్ లో  ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఆత్మహత్యకు చేసుకున్న వీరిద్దరూ బావ మరదలని   తెలిసింది.

TG News: యాదాద్రి(Yadadri) భువనగిరి జిల్లా రాగాల రిసార్ట్స్ లో  ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఆత్మహత్యకు చేసుకున్న వీరిద్దరూ బావ మరదలని   తెలిసింది

వివాహేతర సంబంధం
ప్రాథమిక సమాచారం ప్రకారం.. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా రామంతాపూర్ కేసీఆర్ నగర్ కి చెందిన సుధాకర్, రామంతాపూర్‌లోని గాంధీనగర్‌కు చెందిన పాసాల సుష్మిత ఇద్దరూ  బావమరదలు అవుతారు. వీరిద్దరికి వేర్వేరుగా ప్రేమ వివాహాలు కూడా  జరిగాయి.

అయితే కొంతకాలంగా వీరి మధ్య అక్రమ సంబంధం కొనసాగుతోందని ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరిగాయి. దీనిపై సుష్మిత భర్త నల్గొండ జిల్లాలోని కేతేపల్లి పోలీస్ స్టేషన్‌లో  ఆమె పై కేసు కూడా పెట్టారు. దీంతో మనస్థాపానికి చెందిన సుష్మిత..  బావ సుధాకర్ దగ్గరికి వెళ్ళిపోయింది.

గత రెండు రోజులుగా వీరిద్దరూ బీబీనగర్ (మ) కొండమడుగు రాగాల రిసార్ట్స్ లో గది అద్దెకు తీసుకొని ఉంటున్నారు. కాగా, నిన్న మధ్యాహ్నం ఇద్దరూ కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు సుధాకర్ తన  బావ రంజిత్ కి వేరువేరు సెల్ఫీ వీడియో కాల్ చేసి చెప్పాడు. దీంతో రంజిత్ పోలీసులకు సమాచారం అందించగా.. మొబైల్ నెట్ వర్క్ ద్వారా ఘటన స్థలానికి చేరుకున్నారు. కానీ ఆలోపే సుధాకర్, సుష్మిత చనిపోయి కనిపించారు.  ఇద్దరూ చనిపోయేముందు  6 పేజీల నోట్‌ కూడా  రాశారట.  అయితే కుటుంబాలకు వీరి విషయం తెలియడంతో మొహం చూపించలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది

Also read

Related posts

Share this