విద్యార్థులను అభినందించిన సంక్షేమ వసతి గృహ అధికారులు తోట నాగమణి..
అవనిగడ్డ, ఏప్రిల్ 15(న్యూస్ ): ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష ఫలితాల్లో అవనిగడ్డ బిసి బాలికల కళాశాల సంక్షేమవసతి గృహ విద్యార్థి నులు 88.2 శాతం ప్రతిభ సాధించారు. బుధవారం ప్రభుత్వ విడుదల చేసిన పరీక్షా ఫలితాలలో 971మార్కుల తో బెల్లంకొండ అమూల్య సీనియర్ బైపిసి విభాగంలో 971/1000 మార్కులతో ప్రతిభ కనబరిచింది. అదేవిధంగా ఎంపీసీ విభాగంలో సిహెచ్ పావని 876, మార్కులు,కొక్కిలిగడ్డ వైష్ణవి 866, మార్కులు, ఎన్. మేఘన 857 మార్కులు, మోకాశాలిని 84 మార్కులు తో ఉత్తీర్ణులు కాగా, మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ విభాగంలో మోకా రేణుక ఎంపీసీ లో 426 మార్కులతోను, సీఈసీలో ఎన్ శ్రీలత 428 మార్కులతో కొప్పరాతి గాయత్రి 405 మార్కులతో విజయ్ కేతనం ఎగరవేశారు.హాస్టల్లో జూనియర్, సీనియర్ ఇంటర్ కు సంబంధించి మొత్తం 64 మంది విద్యార్థులు హాజరుకాగా 56 మంది విద్యార్థులు మంచి మార్కులతో విజయం సాధించి 88. 2శాతం ఉత్తీర్ణత సాధించారు. బీసీ సంక్షేమ కళాశాల వసతి గృహంలో చదువుతూ తమ విద్యార్థినులుఉత్తమ ఫలితాలు సాదించడం పట్ల బాలికల సంక్షేమ శాఖ అధికారిణి టి నాగమణి విద్యార్థులను అభినందించారు. ఇదే స్పూర్తితో భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆమె విద్యార్థులకు సూచించారు. ఇష్టమైన కోర్సులను ఎంపిక చేసుకుని భవిష్యత్తులో ఉన్నత విద్యను అభ్యసిస్తూ తల్లిదండ్రులకు విద్య నభ్యసించిన వసతి గృహాలకు గురువులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో విద్యార్థులు వసతి గృహ సిబ్బంది పాల్గొన్నారు.
Also read
- Mantralayam మానవత్వన్ని చాటిన కానిస్టేబుల్.. మహిళ మృతదేహాన్ని కిలోమీటర్ మోసుకెళ్లి…(video)
- 30వ ప్లోర్ నుంచి పార్క్ చేసిన కారుపై పడి సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి.. షిఫ్టైన రెండ్రోజులకే
- Telangana: కూతురిపై లైంగిక వేధింపులు.. భర్తను చెట్టుకు కట్టేసి మరీ కొట్టి చంపిన భార్య!
- మామ హత్య కోసం రూ.5 లక్షల సుపారి… పచ్చని సంసారంలో చెడు వ్యసనాల చిచ్చు..
- హైదరాబాద్లో దారుణం.. చిన్న గొడవతో భార్యను కడతేర్చిన భర్త! చిన్నారుల ముందే ప్రాణం తీసిన రాక్షసుడు..





