April 9, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

వైసిపి నేతపై హత్యాయత్నం
భద్రతా వలయంలో గోవిందపల్లి

శిరివెళ్ల (నంద్యాల జిల్లా) : నంద్యాల జిల్లా శిరివెళ్ల మండల పరిధిలోని గోవిందపల్లిలో శనివారం వైసిపి నేతపై హత్యాయత్నం జరిగింది. గతంలో జరిగిన జంట హత్యల నెత్తుటి మరకలు ఆరకముందే మరో హత్యాయత్నం సంచలనంగా మారింది. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా నిత్యం కొనసాగుతున్న పోలీస్‌ పికెటింగ్‌ గదికి కేవలం పది మీటర్ల దూరంలోనే హత్యాయత్నం ఘటన చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు… శిరివెళ్ల మండల వైసిపి కన్వీనర్‌ ఇందూరి ప్రతాపరెడ్డి శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్లారు. గుడి ఎదురుగా టిడిపి నాయకులు రవిచంద్రారెడ్డి వేట కొడవలితో ఆయనపై దాడి చేశారు. దీంతో, ప్రతాపరెడ్డి అక్కడికక్కడే కుప్పకూలారు. స్థానికులు గట్టిగా కేకలు వేయడంతో నిందితులు పరారయ్యారు. గాయపడిన ఆయనను చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రాథమిక వైద్య సేవలు అందించారు. మెరుగైన చికిత్స కోసం నంద్యాల పట్టణంలోని ఓ ప్రయివేటు వైద్యశాలకు తరలించారు. నంద్యాల జిల్లా ఎస్‌పి అధిరాజ్‌ సింగ్‌ రాణా, ఆళ్లగడ్డ డిఎస్‌పి ప్రమోద్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పక్కనే ఉన్న పోలీస్‌ పికెట్‌ గదిలోని సిసి ఫుటేజ్‌ని పరిశీలించారు. ప్రత్యక్ష సాక్షులు, సిసిటివి ఫుటేజి ఆధారంగా నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని ఎస్‌పి విలేకరులకు చెప్పారు. నంద్యాలలో చికిత్స పొందుతున్న ప్రతాపరెడ్డిని పలువురు ప్రజాప్రతినిధులు, వైసిపి నాయకులు పరామర్శించారు

Also read

Related posts

Share via