SGSTV NEWS online
CrimeTelangana

TS News: చేతబడి చేస్తున్నారన్న నెపంతో దంపతులపై దాడి

మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? అంటారు. అయినా సరే.. ఇప్పటికీ గ్రామాల్లో మూఢ నమ్మకాలు పోవడం లేదు. ఏదో ఒక మూల తమపై చేతబడి చేస్తున్నారనో.. మంత్రాలు జపిస్తున్నారనో దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం వేలుబెల్లిలో చేతబడి చేస్తున్నారన్న నెపంతో దంపతులపై దాడి జరిగింది.


మహబూబాబాద్ : మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? అంటారు. అయినా సరే.. ఇప్పటికీ గ్రామాల్లో మూఢ నమ్మకాలు పోవడం లేదు. ఏదో ఒక మూల తమపై చేతబడి చేస్తున్నారనో.. మంత్రాలు జపిస్తున్నారనో దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం వేలుబెల్లిలో చేతబడి చేస్తున్నారన్న నెపంతో దంపతులపై దాడి జరిగింది. యుగంధర్-రాధిక దంపతులు మంత్రాలు చేస్తున్నారని ఇంట్లోకెళ్లి మరీ లక్ష్మి నర్సు, కృష్ణ అనే ఇద్దరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. బాధితులకు గాయాలవగా.. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also read

Related posts