రాయచూరు రూరల్: తాను ప్రేమించిన అమ్మాయిని స్వగ్రామం నుంచి వేరే చోటికి పంపించిన ఆమె తల్లిదండ్రులపై ఓ ప్రేమికుడు తన సహచరులతో కలిసి దాడి చేయడంతో వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఘటన జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు..జిల్లాలోని సింధనూరు తాలూకా ఆర్‌హెచ్ క్యాంప్–3లో ప్రణవ్ అనే యువకుడు ఓ అమ్మాయిని ప్రేమించాడు.
ఈ విషయం తెలుసుకున్న అమ్మాయి తల్లిదండ్రులు తమ కుమార్తెను బంధువుల ఇంటికి పంపించారు. దీనిని సహించలేక ప్రణవ్ తన సహచరులతో కలిసి ఈనెల 14వ తేదీన తన ప్రేయసి తండ్రి హీరా మోహన్, తల్లి శ్రుతి మండల్, సోదరుడు హిమాంశు, బంధువుపై మారణాయుధాలతో దాడి చేసి గాయపరిచారు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సింధనూరు గ్రామీణ పోలీసులు తెలిపారు
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025