SGSTV NEWS online
Andhra PradeshCrime

తాడిపత్రిలో దారుణం.. భార్యను నరికి చంపిన భర్త



అనంతపురం: తాడిపత్రిలో దారుణం చోటు చేసుకుంది. భార్యను భర్త వెంకటేశ్వరరెడ్డి వేట కొడవలితో నరికి చంపాడు. భార్య పుష్పావతి అక్కడికక్కడే మృతి చెందింది. తాడిపత్రి పట్టణంలోని హేమాద్రి లాడ్జిలో ఘటన జరిగింది. దంపతుల సమస్యలను పరిష్కరించేందుకు ఇరు వర్గాల పెద్దలు లాడ్జిలో సమావేశమయ్యారు. ఒంటరిగా మాట్లాడాలని చెప్పిన భర్త.. భార్యను హత్య చేశాడు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

అనుమానాస్పదంగా మహిళ మృతి

కోనసీమ జిల్లా: రామచంద్రపురం మండలం తోటపేట గ్రామంలో ఈ నెల 12న దామిశెట్టి మహాలక్ష్మి (54) అనుమానాస్పదంగా మృతి చెందింది. సహజ మరణంగా భావించిన బంధువులు సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఆమె ఒంటిపై బంగారం లేదని, బంగారం కోసమే హత్య చేసి ఉంటారని ద్రాక్షారామ పోలీసులకు బంధువులు ఫిర్యాదు చేశారు. దీంతో పాతిపెట్టిన మహాలక్ష్మి మృతదేహాన్ని బయటకు తీశారు. స్మశానవాటిక వద్దనే వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. అనుమానాస్పద మృతి కింద కేసుగా నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Also read

Related posts