శ్రీశైలం : శ్రీశైలంలో ఆదివారం అర్ధరాత్రి దారుణం చోటుచేసుకుంది. క్షేత్రంలోని పాతాళగంగ పాత మెట్ల మార్గంలో ఇద్దరు వ్యక్తులు గాజు సీసాతో అశోక్ అనే వ్యక్తి గొంతు కోసి హత్య చేశారు. ఆదివారం తెల్లవారు జామున చెత్త పేపర్లు సేకరించే వ్యక్తులు చూసి 108కి ఫోన్ చేయగా వాళ్ళు స్థానిక పోలీసులకు సమచారం అందించారు. విషయం తెలుసుకున్న శ్రీశైలం ఒకటవ పట్టణ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి హుటాహుటిన 108లో సుండిపెంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే అశోక్ మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. అశోక్‌ని హత్య చేసిన ఇద్దరు నిందితులను శ్రీశైలం పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. వ్యక్తి హత్య ఘటనతో శ్రీశైలంలో స్థానికులు ఉలిక్కిపడ్డారు
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025