February 3, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

కర్నూలులో దారుణం.. మైనర్ బాలికపై అత్యాచారయత్నం


కర్నూలులోని చెల్లెల చెలిమలలో ఓ మైనర్ బాలికపై యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. వెంటనే బాలిక కేకలు వేయడంతో యువకుడు పారిపోవడానికి ప్రయత్నించగా కుటుంబ సభ్యులు పట్టుకున్నారు. బాధితరాలి కుటుంబ సభ్యులు యువకుడి ఇంటిపై నిప్పు అంటించారు.

కర్నూలు జిల్లా దేవనకొండలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే చెల్లెల చెలిమలలో ఓ మైనర్ బాలికపై యువకుడు అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. దీంతో ఆ బాలిక కేకలు వేయడంతో యువకుడు పారిపోవడానికి ప్రయత్నించాడు. వెంటనే కుటుంబ సభ్యులు ఆ యువకుడిని పట్టుకుని దేహశుద్ధి  చేశారు. ఆ తర్వాత యువకుడి ఇంటికి బాధితరాలి కుటుంబీకులు నిప్పు అంటించారు. దీంతో చెల్లెల చెలిమలలో భారీగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

విద్యార్థులతో అసభ్యంగా..
ఇదిలా ఉండగా ఇటీవల మంచిర్యాలో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించాడు. వెంటనే అతనికి దేహశుద్ది చేశారు. మంచిర్యాల ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో సత్యనారాయణ అనే టీచర్ ఇలా చేయడంతో విద్యార్థినుల తల్లిదండ్రులు మార్కెట్ ఏరియాలో చెప్పులతో కొట్టారు. దీంతో టీచర్ గోడ దూకి పారిపోయాడు.

అంతేకాకుండా మద్యం సేవించి పాఠశాలకు వచ్చి ఇబ్బందులకు గురిచేస్తున్నాడు.  సత్యనారాయణ మాటలు భరించలేదని విద్యార్థినులు తల్లిదండ్రులకు విషయం చెప్పారు. ఆగ్రహించిన పలువురు తల్లులు పాఠశాలకు వచ్చి టీచర్‌ని కూడా నిలదీశారు. చివరకు బాధిత తల్లిదండ్రులు సత్యనారాయణపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఉపాధ్యాయుడు ఎక్కడ కనిపించిన కూడా విద్యార్థుల తల్లిదండ్రులు చెప్పులతో కొడుతున్నారు. ఆఖరికి రోడ్డుపైనే చెప్పులతో కొట్టారు. దీంతో ఉపాధ్యాయుడు చితక బాదుతున్న మహిళలు నుంచి తన తప్పుని క్షమించమని వేడుకున్నాడు. కోపంతో ఉన్న మహిళలు చెప్పులతో ఉపాధ్యాయుడిని ఇంకా చితక బాదారు. ఆ తర్వాత డీఈవోకి ఫిర్యాదు చేశారు. విచారణ చేయమని అధికారులు తెలిపారు. విచారణలో అతను తప్పు చేసినట్లు తేలితే.. సస్పెండ్‌ చేస్తామని డీఈవో తెలిపారు

Also read

Related posts

Share via