కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణం చోటుచేసుకుంది. మైనర్ బాలికపై వైసీపీ నేత దాదాపీర్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు బాధిత తల్లి ఆరోపించింది. దాదాపీర్ ఇంట్లో తల్లి కూతురు అద్దెకు ఉంటుండుగా.. తను లేని సమయంలో కుమార్తెపై అత్యాచారయత్నం చేశాడని తెలిపింది
Kadapa: కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణం చోటుచేసుకుంది. వైసీపీ నేత దాదాపీర్ మైనారిటీ మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు బాధిత తల్లి ఆరోపించింది. దాదాపీర్ లైంగిక వేధింపులు తట్టుకోలేక మీడియా ముందు గోడు వెళ్ళబోసుకుంది మైనర్ బాలిక తల్లి.
దాదాపీర్ ఇంట్లో తల్లి జమీలా, కూతురు అద్దెకు ఉంటున్నారు. ప్రొద్దుటూరు 23 వార్డు వైసీపీ కౌన్సిలర్ తండ్రి వడ్ల దాదాపీర్ మాయ మాటలు చెప్పి తన కుమార్తె(19)ను బలవంతంగా శారీరకంగా అనుభవిస్తున్నట్లు బాధిత తల్లి తెలిపింది. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరిస్తున్నట్లు వెల్లడించింది.
వైసీపీ నేత దాదాపీర్ తన కూతురు జీవితాన్ని నాశనం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పెళ్లి సంబంధాలు చూస్తున్నా వడ్ల దాదాపీర్ చంపుతామని బెదిరిస్తున్నాడని ఆరోపించింది. చివరకు ఇళ్ళు ఖాళీ చేస్తామన్నా చెయ్యనివ్వకుండా వేధింపులకు గురిచేస్తున్నాడని పేర్కొంది.
Also read
Also read
- Medak: ప్రేమ పెళ్లి.. పేరెంట్స్ను కౌన్సిలింగ్కు పిలిచిన పోలీసులు.. ఆపై ఊహించని సీన్..
- Hyderabad: కుటుంబ సమేతంగా ఆత్మహత్యాయత్నం.. ఒక్క ఫోన్ కాల్ జీవితాలనే మార్చేసింది..!
- Ratha Saptami 2026: దరిద్రం వదిలి ఐశ్వర్యం వస్తుంది!.. రథ సప్తమి నాడు ఏ రాశి వారు ఏం దానం చేయాలి?
- Moon Transit: చంద్ర సంచారం.. ఈ మూడు రాశులకు జాక్పాట్.. ఊహించని లాభాలు!
- భార్యను చంపేశానంటూ పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన భర్త.. విచారణలో సంచలనాలు..!





