February 3, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

AP: దారుణం.. మాజీ మంత్రి కాకాణి అనుచరుడి భాగోతం.. మహిళపై లైంగిక దాడి!


ఏపీలో మహిళపై లైంగికదాడి కేసులో మాజీ మంత్రి కాకాణి అనుచరుడు వైసీపీ నేత వెంకట శేషయ్య అరెస్ట్‌ అయ్యారు. ఉద్యోగం ఇప్పిస్తానంటూ వెంకట శేషయ్య ఓ మహిళపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. పదే పదే ఇబ్బందిపెట్టడంతో ఆ మహిళ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

రాజకీయ అండతో కొందరు నేతలు రెచ్చిపోతున్నారు. తమ కోరికలు తీర్చాలంటూ మహిళలను వేధిస్తున్నారు. ఒప్పుకోకపోతే ఏదో వంకపెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అలాంటిదే మరో సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఏపీలోని మాజీ మంత్రి ప్రధాన అనుచరుడైన ఓ వ్యక్తి మహిళలను లొంగదీసుకున్నాడు.

ఉద్యోగం ఇప్పిస్తానని పలుమార్లు అత్యాచారం చేశాడు. ఆ మహిళ ఊరు వదిలి వేరే ప్రాంతానికి వెళ్లినా అతడి కామకోరికలు తగ్గలేదు. ఫోన్ చేసి బెదిరించాడు. దీంతో సహనం కోల్పోయిన ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఈ వ్యవహారమంతా ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

వెంకటాచంలో పనిచేస్తున్న లైన్‌మెన్‌‌కు తిరుపతి జిల్లాకు చెందిన ఓ మహిళతో 13 ఏళ్ల క్రితం పెళ్లైంది. అయితే 2021లో ఆమె భర్త గుండెపోటుతో మరణించాడు. దీంతో ఒక్కసారిగా కుటుంబభారం భార్యపై పడింది. కుటుంబ పోషణ నిమిత్తం భర్త ఉద్యోగాన్ని భర్య అడిగింది. కానీ అత్తంటివారు మాత్రం భర్త తమ్ముడికి ఇప్పించాలని ప్రయత్నించారు. ఈ గొడవ సర్ధుమనిగించేందుకు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రధాన అనుచరుడు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైకాపా ఉపాధ్యక్షుడు మందల వెంకట శేషయ్య ఎంట్రీ ఇచ్చాడు.

చెప్పినట్లు వినకపోతే ఉద్యోగం రాదు
తాను, తన బిడ్డలు రోడ్డున పడతామని ఆ మహిళ వెంకట శేషయ్యను ప్రాధేయపడింది. దీంతో భర్త ఉద్యోగం భార్యకి.. ఇతర ప్రయోజనాలు అత్తమామాలకు వచ్చేలా రాజీ చేశాడు. ఈ క్రమంలోనే వెంకట శేషయ్య ఆ మహిళతో అసభ్యంగ, అనుచితంగా ప్రవర్తించాడు. తాను చెప్పినట్లు వినకపోతే ఉద్యోగం రాకుండా చేస్తానని బెదిరించాడు. లైంగికంగా తనను తృప్తి పరిస్తే ఉద్యోగం ఇప్పిస్తానన్నాడు. దీంతో ఏం చేయాలో తెలియక ఆ మహిళ అంగీకరించింది. దీంతో వెంకట శేషయ్య పలుమార్లు తనపై లైంగికదాడికి పాల్పడ్డాడు

ఊరు విడిచి వెళ్లినా ఆగని వేధింపులు
ఇక 2022లో ఆ మహళకు ఉద్యోగం వచ్చి సూళ్లూరుపేటకు వెళ్లిపోయింది. అప్పటి నుంచి అక్కడే ఉంటుంది. అయినా వెంకట శేషయ్య వేధింపులు ఆగలేదు. ఏదో కారణంతో పిలిచి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇటీవల అతడు చాలా సార్లు ఆమెకు ఫోన్ చేశాడు. కానీ ఆమె రెస్పాండ్ అవ్వలేదు.

కోపం పెంచుకున్న ఆయన ఆ మహిళ డిసెంబర్ 22న వెంకటాచలం రావడంతో బెదిరించాడు. కోరిక తీర్చాలని బలవంతం చేయడంతో ఆమె వెంకటాచలం పోలీస్టేషన్‌కు పరుగులు తీసింది. అక్కడ వెంకట శేషయ్యపై కంప్లైంట్ ఇచ్చింది. జరిగిన విషయాన్ని మొత్తం ఆమె చెప్పింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read

Related posts

Share via