పాట్నా: సార్వత్రిక ఎన్నికల వేళ బిహార్ లో అలజడి రేగింది. ముఖ్యమంత్రి నితీష్ కుమారికి చెందిన జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) యువ నాయకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పాట్నాలో ఒక కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తుండగా బుధవారం అర్ధరాత్రి ఆయన్ను దుండగులు కాల్చి చంపారు.
బైక్ పై వచ్చిన నలుగురు వ్యక్తులు జేడీయూ నేత సౌరభ్ కుమార్ తలపై రెండుసార్లు కాల్చారు. ఆయన వెంట ఉన్న సహచరుడు మున్మున్పైనా కాల్పులు జరిపి పరారయ్యారు. నెత్తుటి మడుగులో ఉన్న వారిని వెంటనే ఆసుపత్రికి తరలించగా, సౌరభ్ చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. మున్మున్ పరిస్థితి విషమంగా ఉంది.
పాట్నా పోలీసుల ప్రత్యేక బృందం రాత్రి తర్వాత సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించింది. ఈ హత్యపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు రోడ్డును దిగ్బంధించారు. సమాచారం అందుకున్న లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మిసా భారతి కూడా పునున్కు చేరుకుని బాధితుడి కుటుంబ సభ్యులను ఓదార్చారు.
Also read
- Andhra Pradesh: 10 నిమిషాల్లో ఇంటికి చేరేవారే.. కానీ అంతలోనే కబలించిన మృత్యువు!
- అయ్యో పాపం.. ఐదేళ్లకే ఆ బాలుడికి ఆయుష్షు తీరిపోయింది..!
- ఎస్బీఐ బ్యాంకుకు కన్నం.. రూ.13 కోట్ల విలువ చేసే బంగారం లూటీ.. లబోదిబోమంటున్న కస్టమర్లు
- స్కూల్కి వెళ్లాల్సిన బాలుడు.. బావిలో శవమై తేలాడు.. మిస్టరీగా మారిన మరణం
- డబ్బులిస్తాం.. అంటూ ఇంటికి పిలిచిన దంపతులు.. చివరకు ఏం జరిగిందంటే..