April 6, 2025
SGSTV NEWS
Astro TipsAstrology

Saturn Transit 2025: త్వరలో నక్షత్రాన్ని మార్చుకోనున్న శనీశ్వరుడు.. ఈ మూడు రాశుల వారు పట్టిందల్లా బంగారమే..



జ్యోతిషశాస్త్రంలో నవ గ్రహాల్లో శనిశ్వరుడికి ప్రత్యేక స్థానం ఉంది. శనీశ్వరుడు న్యాయాధిపతి. వ్యక్తి కర్మలను బట్టి ఫలితాలను ఇస్తుంటారు. త్వరలో శనీశ్వరుడు నక్షత్రాన్ని మార్చుకోనున్నాడు. దీని వల్ల కొన్ని రాశులకు చెందిన వ్యక్తులు చాలా ప్రయోజనం పొందనున్నారు. కనుక ఆ అదృష్ట రాశులు ఏమిటో తెలుసుకుందాం..


నవ గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారుతూ ఉంటాయి. అదే సమయంలో ఒక నిర్దిష్ట సమయంలో నక్షత్రాన్ని మార్చుకుంటాయి. ఈ సమయంలో మొత్తం రాశులకు చెందిన వ్యక్తులు ప్రభావితం అవుతారు. ఇటీవలే శనీశ్వరుడు రెండున్నర సంవత్సరాల తర్వాత రాశిని మార్చుకున్నాడు. అంటే కుంభ రాశి నుంచి 29 మార్చి 2025న మీన రాశిలోకి ప్రవేశించాడు. ఇది ఈ సంవత్సరం అతిపెద్ద సంచారము. మీన రాశిలోకి వెళ్ళిన తర్వాత.. శనీశ్వరుడు నక్షత్రాలను మారుతూ ఉంటారు. ఇలా శనిశ్వరుడి కదలిక వల్ల కొన్ని రాశుల వ్యక్తులు ఎంతో ప్రయోజనం పొందనున్నారు. ఈ సమయంలో కొంత మంది వ్యక్తుల పెండింగ్ పనులు పూర్తి అవుతాయి. ఆర్థిక లాభం పొందే అవకాశాలు ఉన్నాయి.

శనీశ్వరుడు నక్షత్రాన్ని ఎప్పుడు మార్చుకుంటాడంటే
జ్యోతిషశాస్త్ర గణనల ప్రకారం ఈసారి న్యాయదేవత శనీశ్వరుడు ఏప్రిల్ 28వ తేదీ ఉదయం 7:52 గంటలకు ఉత్తరభాద్రపదంలోకి ప్రవేశిస్తాడు. ఇది 27 నక్షత్రరాశులలో 26వ నక్షత్రంగా పరిగణించబడుతుంది. ఈ నక్షత్రానికి అధిపతి శనీశ్వరుడు.

ఈ రాశుల వారికి మంచి రోజులు ప్రారంభమవుతాయి

👉  మిథున రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులకు శనిదేవుని నక్షత్రంలో మార్పు శుభప్రదంగా నిరూపించబడుతుంది. ఈ సమయంలో మిథున రాశి వ్యక్తులు పూర్తి అంకితభావం, కృషితో పనిచేయడం ద్వారా ఆర్థిక లాభాలను పొందే అవకాశాలు ఉన్నాయి. పెండింగ్‌లో ఉన్న అన్ని పనులు పూర్తి అవుతాయి. పనిలో అడ్డంకులు తొలగిపోతాయి. కోర్టు కేసులలో వీరికి ఉపశమనం లభిస్తుంది. వీరు పట్టిందల్లా బంగారమే. అదృష్టం వీరి సొంతం. ఈ కారణంగా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.


👉   మకర రాశి: శనిదేవుని నక్షత్రంలో మార్పు కారణంగా.. మకర రాశి వారికి అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఈ కాలంలో ఈ రాశులకు చెందిన వ్యక్తుల ఆర్థిక స్థితిలో మెరుగుదల కనిపిస్తుంది. వీరు కోరుకున్న పనులలో విజయం సాధిస్తారు. మూలధన పెట్టుబడికి ఇది మంచి సమయం.. లాభపడే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ, వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. అలాగే వీరు పిల్లలకు సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం ఉంది.

👉   కుంభ రాశి: ఈ రాశి వారికి శనిశ్వరుడి నక్షత్రంలో మార్పు ఆనందాన్ని బహుమతిగా తెస్తోంది. ఈ సమయంలో కుంభ రాశి వారికి వారి ఉద్యోగంలో ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. వీరు ఎప్పటి నుంచో తీర్చాల్సిన అప్పుల నుంచి ఉపశమనం పొందుతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపారంలో ఆర్థిక లాభం వచ్చే సూచనలు ఉన్నాయి. వీరు నచ్చిన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. మూలధన పెట్టుబడి నుంచి ఆర్థిక లాభం పొందే అవకాశాలు ఉన్నాయి. వీరు కుటుంబంతో కలిసి ఆధ్యాత్మిక యాత్రలను వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తారు.


Also read

Related posts

Share via