March 12, 2025
SGSTV NEWS
Astro TipsAstrology

Lucky Zodiac Signs: మీన రాశిలో రవి, బుధుల కలయిక.. ఆ రాశుల వారికి అరుదైన యోగం..!

 

Budhaditya Yoga: ఈ నెల 14 నుండి మీన రాశిలో బుధాదిత్య యోగం ఏర్పడుతోంది. కొన్ని రాశుల వారికి రాజయోగాలు, ధనయోగాలు పట్టే అవకాశం ఉంది. ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి, ఆర్థిక లాభాలు, ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. విదేశీయానం, వివాహాలలో సానుకూల ఫలితాలుంటాయి. ఈ యోగం వల్ల కలిగే వివిధ రాశుల వారికి ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..


ఈ నెల 14 నుంచి మీన రాశిలో విశిష్టమైన బుధాదిత్య యోగం, అంటే రవి, బుధుల కలయిక చోటు చేసుకుంటోంది. ఈ రాశిలో రవికి ఉచ్ఛ బలం పడుతుంది. తనకు నీచ రాశి అయిన మీన రాశిలో బుధుడు వక్రించడం వల్ల ఈ గ్రహానికి కూడా ఉచ్ఛ బలం పడుతుంది. అందువల్ల సాధా రణ బుధాదిత్య యోగం కన్నా మీన రాశిలో ఈసారి ఏర్పడే బుధాదిత్య యోగం రెట్టింపు బలంతో పనిచేస్తుంది. ఈ యోగం వల్ల వృషభం, మిథునం, కన్య, ధనుస్సు, మకరం, కుంభ రాశులకు ఏప్రిల్ 15 వరకూ అవిచ్ఛిన్నంగా రాజయోగాలు, ధన యోగాలు పట్టే అవకాశం ఉంది.


👉   వృషభం: ఈ రాశికి లాభ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల ఒకటి రెండు ధన యోగాలు పట్టే అవకాశం ఉంది. ఏ ఆదాయ వృద్ధి ప్రయత్నమైనా నూరు శాతం ఫలితాలనిస్తుంది. అనారోగ్యాల నుంచి చాలావరకు ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా విజయవంతం అవుతాయి. వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. విదేశీ సంపాదనను అనుభవించే యోగం ఉంది. మనసులోని ముఖ్యమైన కోరికలు నెరవేరుతాయి. ఆరోగ్య లాభం కలుగుతుంది.

👉   మిథునం: ఈ రాశికి దశమ స్థానంలో, అంటే ఉద్యోగ స్థానంలో రాశ్యధిపతి బుధుడితో రవి కలవడం వల్ల ఉద్యోగంలో అధికారుల ఆదరాభిమానాలు పెరగడంతో పాటు హోదా పెరగడానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు కూడా మంచి ఆఫర్లు అందుతాయి. మరింత మంచి ఉద్యోగంలోకి రావడానికి అవకాశాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు బాగా రాణించే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో మీ ప్రత్యేకతను, సమర్థతను నిరూపించుకుంటారు. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.

👉   కన్య: రాశ్యధిపతి బుధుడు సప్తమ స్థానంలో రవితో చేరడం వల్ల వైవాహిక సమస్యల నుంచి బయట పడడం జరుగుతుంది. దంపతుల మధ్య సఖ్యత, సాన్నిహిత్యం బాగా వృద్ధి చెందుతాయి. వృత్తి, వ్యాపారాలు క్రమంగా కష్టనష్టాల నుంచి విముక్తి పొందే అవకాశం ఉంది. విదేశీయానానికి ఆటంకాలు తొలగిపోతాయి. నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగం లభిస్తుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి కావడం జరుగుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.

👉    ధనుస్సు: ఈ రాశికి భాగ్య, దశమాధిపతులైన రవి, బుధులు చతుర్థ స్థానంలో కలవడం వల్ల బుధాదిత్య యోగమే కాకుండా అరుదైన ధర్మకర్మాధిప యోగం కూడా ఏర్పడుతోంది. దీనివల్ల మహా భాగ్య యోగాలు కలగడంతో పాటు, అధికార యోగాలు కూడా కలుగుతాయి. రాజకీయంగా ప్రాబల్యం పెరుగుతుంది. ప్రభుత్వం ద్వారా గుర్తింపు లభిస్తుంది. అనేక వైపుల నుంచి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ పెరుగుతుంది.

👉   మకరం: ఈ రాశికి తృతీయ స్థానంలో రవి, బుధులు కలవడం వల్ల ఈ రాశివారు ఏ ప్రయత్నం చేపట్టినా విజయవంతం అవుతుంది. ముఖ్యంగా ఆదాయ ప్రయత్నాలు నూటికి నూరుపాళ్లు సఫలం అవుతాయి. ప్రయాణాల వల్ల బాగా లాభం ఉంటుంది. ఉన్నత స్థాయి వారితో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని పదోన్నతులు లభిస్తాయి.

👉   కుంభం: ఈ రాశికి ధన స్థానంలో బుధు రవులు కలవడం వల్ల ఆదాయానికి సంబంధించిన ప్రతి ప్రయత్నమూ విజయవంతం అవుతుంది. రావలసిన సొమ్ము కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. సమాజంలో మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఇతర ఆర్థిక లావాదేవీల వల్ల బాగా లాభాలు కలుగుతాయి. కొన్ని ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడడం జరుగుతుంది

Also read

Related posts

Share via