SGSTV NEWS online
Astro TipsAstrologySpiritual

మరో రెండు నెలలు వారికి అన్ని శుభ యోగాలే..! ఇందులో మీ రాశి ఉందా?





మే 12 నుంచి 17 మధ్య కుజుడు, రవి, బుధుడు, శుక్రుడు కీలక రాశి మార్పులు చేయడంతో ఆరు రాశుల వారికి శుభకాలం ప్రారంభమైనట్లు జ్యోతిష్య సూచనలు చెబుతున్నాయి. ముఖ్యంగా మేషం, వృషభం, తుల, ధనుస్సు, మకరం, మీన రాశుల వారికి ఉద్యోగం, ఆదాయం, ప్రేమ, పెళ్లి, విదేశీ అవకాశాల్లో వచ్చే రెండు నెలలు అనుకూల ఫలితాలు అందించే అవకాశం ఉంది.


మే 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు నాలుగు ముఖ్యమైన గ్రహాలు రాశులు మారడం జరిగింది. ఈ నాలుగు గ్రహాలకు ఈ రాశులన్నీ అనుకూల స్థానాలే. కుజ, రవి, బుధ, శుక్రులు వరుసగా మేషం, వృషభం, మిథున రాశుల్లోకి మారడం జరిగింది. ప్రస్తుతం ఆరు రాశులకు గ్రహాలన్నీ చాలావరకు అనుకూలంగా ఉన్నాయి. మేషం, వృషభం, తుల, ధనుస్సు, మకరం, మీన రాశులకు తప్పకుండా అధికారం, ఆదాయం, విదేశీయానం, ఉద్యోగం, పెళ్లి, ప్రేమల్లో వీరికి ఇది కలిసి వచ్చే కాలం అని చెప్పవచ్చు. ఈ అనుకూల సమయం దాదాపు రెండు నెలల వరకూ కొనసాగే సూచనలున్నాయి.


మేషం: రాశ్యధిపతి కుజుడు స్వస్థానంలో ఉండడంతో పాటు, గురు, బుధ, శుక్రుల అనుకూలత కూడా కలిగినందువల్ల ఈ రాశివారికి వృత్తి, ఉద్యోగాలతో పాటు ఆర్థికంగా కూడా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. అనేక విధాలుగా సంపద పెరుగుతుంది. ఏ కార్యం తలపెట్టినా విజయవంతమవుతుంది. ఆశించిన శుభవార్తలు వింటారు. అనుకోని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. సంతానం లేనివారికి సంతాన యోగం పడుతుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి.

వృషభం: శని, రాహువులతో పాటు, శుభ గ్రహాలన్నీ ఈ రాశికి ప్రస్తుతం అనుకూల స్థానాల్లో సంచారం చేస్తున్నందువల్ల అనేక విధాలుగా ఆర్థిక లాభం కలిగే అవకాశం ఉంది. రావలసిన డబ్బు అందడంతో పాటు ఆస్తి, ఆదాయం కలిసి వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. వృత్తి, ఉద్యోగాల్లో జీత భత్యాలు, వ్యాపారాల్లో లాభాలు బాగా వృద్ధి చెందుతాయి. ఆశించిన శుభవార్తలు వినడం జరుగు తుంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి.

తుల: ఈ రాశివారికి రాహు కేతువులతో సహా దాదాపు ప్రతి గ్రహమూ అనుకూల సంచారం చేస్తున్నందువల్ల ఉన్నతోద్యోగం లభించే అవకాశం ఉంది. ఒక సంస్థకు అధిపతి అయ్యే అవకాశం కూడా ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం వృద్ధి చెందుతాయి. సంపన్నులతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ప్రేమ ప్రయత్నాలు సఫలమవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది.

ధనుస్సు: ప్రస్తుతం ఈ రాశివారికి అయిదు గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల మహా భాగ్య యోగం పట్టే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారానికి, జీతభత్యాలు బాగా పెరగడానికి అవకాశం ఉంది. ఆస్తి వివాదం ఒకటి అనుకూలంగా పరిష్కారం అవుతుంది. తల్లితండ్రుల నుంచే కాక, కుటుంబ సభ్యుల నుంచి కూడా సంపద పెరిగే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఉద్యోగపరంగా శుభవార్తలు వింటారు. అదనపు ఆదాయ మార్గాలు సత్ఫలితాలను ఇస్తాయి.

మకరం: రాశ్యధిపతి శనితో సహా ఈ రాశికి ఆరు గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఈ రాశివారి ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. అనేక విధాలుగా విశేషంగా ఆర్థిక లాభాలు పొందుతారు. ఊహించని విధంగా మహా భాగ్య యోగం పడుతుంది. అదనపు ఆదాయానికి, అదనపు రాబడికి బాగా అవకాశం ఉంది. నిరుద్యోగులకు అంచనాలకు మించిన జీతభత్యాలతో ఉద్యోగం లభిస్తుంది. సంపన్నులతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.

మీనం: రాశ్యధిపతి గురువుతో పాటు కుజ, శుక్ర, బుధ, రవులు కూడా అనుకూల సంచారం చేస్తున్నందు వల్ల ఈ రాశివారికి ఏలిన్నాటి శని ప్రభావం తగ్గడంతోపాటు శుభ యోగాలు పట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్థిక స్థితిగతులు గణనీయంగా మెరుగుపడడం జరుగుతుంది. ఎటువంటి ఆదాయ ప్రయత్నమైనా సఫలం అవుతుంది. సిరిసంపదలు వృద్ది చెందుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతికి, జీతభత్యాలు పెరగడానికి అవకాశం ఉంది. విదేశీ సొమ్ము అనుభవించే యోగం ఉంది.

Also read

Related posts