పాత ఎల్లాపూర్ గ్రామంలో వృద్ధ రైతు పట్ల దురుసుగా ప్రవర్తించిన ఏఎస్ఐను సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. సమస్య చెప్పుకునేందుకు ఎమ్మార్వో ఆఫీసుకు వచ్చిన వృద్ధ రైతును కనికరం లేకుండా దౌర్జన్యంగా ఎమ్మార్వో ఆఫీసు నుండి ఈడ్చుకెళళ్లాడు ఏఎస్ఐ.
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్ గ్రామంలో వృద్ధ రైతు పట్ల దురుసుగా ప్రవర్తించిన ఏఎస్ఐను సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. సమస్య చెప్పుకునేందుకు ఎమ్మార్వో ఆఫీసుకు వచ్చిన వృద్ధ రైతును కనికరం లేకుండా దౌర్జన్యంగా ఎమ్మార్వో ఆఫీసు నుండి ఈడ్చుకెళళ్లాడు ఏఎస్ఐ. అక్కడున్నవారంతా దీనిని ఫోన్ లో రికార్డు చేయగా అది కాస్త వైరల్ గా మారింది. దీనిపై ఉన్నాతాధికారులు వెంటనే రియాక్ట్ అయ్యారు. రైతుతో దురుసుగా ప్రవర్తించిన ఏఎస్ఐ రాంచందర్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ఎస్పీ జానకీ ఉత్తర్వులు జారీ చేసింది.
అంతకుముందు ఈ ఘటనపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా స్పందించారు. సమస్య చెప్పుకునేందుకు తహశీల్దార్ కార్యాలయంకు వెళ్లిన వృద్ధ రైతు పట్ల ఇంత కర్కశంగా వ్యవహరిస్తారా? ఇదేనా మీరు చెబుతున్న ప్రజా పాలన అంటూ సీఎం రేవంత్ ను హరీష్ నిలదీశారు. సీఎం ఆదేశాలతో ఇంత అత్యుత్సాహం ప్రదర్శించడం పోలీసులకు అవసరమా అని ప్రశ్నించారు.
నాడు లగచర్ల లంబాడి రైతన్నల చేతులకు బేడీలు వేశారు? నేడు ఖానాపూర్ లో వృద్ద రైతు మెడలు పట్టి గెంటేశారు. ఎద్దేడ్చిన ఎవుసం, రైతేడ్చిన రాజ్యం బాగుపదడదన్న సంగతి మరిచిపోయి ఇంత క్రూరంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు హరీష్. రైతు పై చేయి వేసిన పోలీసు పై వెంటనే డీజీపీ చర్యలు తీసుకోవాలని, బేషరతుగా యావత్ తెలంగాణ రైతు లోకానికి కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నామన్నారు హరీష్.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025