*
నగరంలో దీపిక ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చిన ఓ యువతిపై అత్యాచారం చేసిన నిందితుడిని అరెస్టు చేసినట్లు సీపీ గౌస్ ఆలం తెలిపారు. ఈనెల 6న అనారోగ్యంతో బాధపడుతున్న జగిత్యాల జిల్లాకు చెందిన సదరు యువతిని కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో హాస్పిటల్లోనే పనిచేస్తున్న దక్షిణామూర్తి (23) అనే యువకుడు ఆమెకు తెలియకుండా ముత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టారు., సిపి మాట్లాడుతూ మహారాష్ట్ర సిరోంచ కు చెందిన దక్షిణామూర్తి ఆసుపత్రి OT లో టెక్నీషియన్ గా పని చేస్తున్నడనీ, అత్యాచారం చేసే ముందు సీసీ కెమెరాలో రికార్డ్ కాకుండా వాటిపై పరదా వేశాడని, మద్యం సేవించి వచ్చి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని, అతని మొబైల్ ఫోన్ లో కూడా అశ్లీల చిత్రాలు కూడా లభ్యమయ్యాయనీ తెలిపారు.
Also read
- టార్గెట్ ఒకరు.. ప్రాణం పోయింది మరొకరిది.. బట్టల తీగకు కరెంట్ షాక్ పెట్టి హత్య
- దేవాయంలో ప్రదక్షిణలు ఎందుకు చేస్తారు..? ఏ దేవుడికి ఎన్ని ప్రదక్షిణలు చేయాలో తెలుసా..?
- Lord shiva: జ్ఞానానికి సంకేతం శివుడి మూడో కన్ను.. గరుడ పురాణంలో భయంకర నిజాలు!
- నేటి జాతకములు…15 మార్చి, 2026
- మేడ్చల్ జిల్లాలో అమానుషం! పెళ్లికి నిరాకరించిందని యువతికి HIV ఇంజెక్షన్ ఇచ్చిన ఉన్మాది!





