హైదరాబాద్:బోరబండ(Borabanda)లో అందరూ చూస్తుండగానే దారుణం జరిగింది. పదిహేడేళ్ల ఓ బాలికతో కొందరు దుండగులు అనుచితంగా ప్రవర్తించారు. ఇంట్లోకి వెళ్లి మరీ ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఓ ఆటో డ్రైవర్ వాళ్లను అడ్డుకుని.. ఆమెను రక్షించారు. అయితే..
దుండగుల దాడిలో ఆ డ్రైవర్కు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో స్థానికులు 100కు (Dial 100) ఫోన్ చేసి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు(Police) కామాంధులను అదుపులోకి తీసుకున్నారు. గాయపడి డ్రైవర్ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసుల నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడాల్సి ఉంది.
Also Read
- పోసానికి మరో షాక్ – పీటీ వారెంట్‌తో జైలు నుంచి విడుదలకు బ్రేక్
- చిత్తూరు కాల్పుల ఘటనలో బిగ్ ట్విస్ట్ – దోపిడీకి వ్యాపారి ప్లాన్ –
- పోలీసులకు చుక్కలు చూపించాడు.. తప్పించుకుని ముప్పుతిప్పలు పెట్టిన ఖైదీ!
- Andhra: చోరీ చేసిన సొత్తు ఎక్కడ అంటే.. ఓ చోట గోతాల్లో ఉన్నాయన్నారు.. వెళ్లి చెక్ చేయగా..
- పెళ్లంటే ఇష్టం లేదు.. జీవితంలో ఇంకో స్టెప్ తీసుకోలేను..