మాజీ ఎమ్మెల్యే, తమిళ నటుడు కరుణాస్ బ్యాగులో తూటాలు బయటపడ్డాయి.
చెన్నై: సినీ నటుడు, మాజీ ఎమ్మెల్యే కరుణాస్ బ్యాగులో పెద్ద సంఖ్యలో బుల్లెట్లు బయటపడటం కలకలం రేపింది. ఆదివారం ఉదయం ఆయన విమానం ఎక్కేందుకు చెన్నై డొమెస్టిక్ ఎయిర్‌పోర్టుకు వచ్చారు. తనిఖీల సమయంలో ఆయన బ్యాగులో దాదాపు 40 బుల్లెట్లు గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ వ్యవహారంపై నటుడిని ప్రశ్నించగా.. వీటిని తీసుకెళ్లేందుకు తగిన డాక్యుమెంట్లు తన వద్ద ఉన్నట్లు అధికారులకు చెప్పారు. దీంతో బుల్లెట్లు ఉన్న బ్యాగుతో విమానం ఎక్కేందుకు నిరాకరించిన అధికారులు.. తిరిగి వెనక్కి వెళ్లిపోయేందుకు ఆయన్ను అనుమతించారు.
Also read
- నేటి జాతకములు 26 జూలై, 2026
- కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం – రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం..ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
- తల్లికి వందనం డబ్బుల కోసం భార్య హత్య
- కోనసీమ జిల్లాలో విషాదం.. పంటకాల్వలో మునిగి ముగ్గురి మృతి
- ఐదో అంతస్తు నుంచి దూకి పీజీ వైద్యవిద్యార్థిని బలవన్మరణం





