దేశం కోసం తన ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాడుతున్న ఓ జవాన్ భూమికి రక్షణ లేకుండా పోయింది. రెవెన్యూ , పోలీసు అధికారులకు చెప్పుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆయన ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్‌గా మారింది.
Ap News : దేశం కోసం తన ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాడుతున్న ఓ జవాన్ భూమికి రక్షణ లేకుండా పోయింది. రెవెన్యూ , పోలీసు అధికారులకు చెప్పుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆయన ఒక వీడియో తీసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ లకు తన గోడును వెల్లబోసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్‌గా మారింది. మంత్రి నారా లోకేష్ దృష్టికి కూడా వెల్లడంతో ఆయన స్పందించారు. తన టీమ్ అవసరమైన సహాయం చేస్తుందని, తగిన న్యాయం చేస్తుందని హామీ ఇచ్చారు.
జవాన్ తెలిపిన వివరాల ప్రకారం ..అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం చిట్టెంవారి పల్లి గ్రామానికి చెందిన జవాన్ మోహన్‌కు చెందిన భూమిని కొంతమంది కబ్జా చేశారు. తన భూమితో పాటు 45 మందికి చెందిన భూమితో పాటు ప్రభుత్వ భూమిని చిన్నప్పగారి రెడ్డప్ప,లక్షణగారి అంజప్ప, బోడె రెడ్డప్ప అనే ముగ్గురు కబ్జా చేశారు, ఈ విషయమై గత నాలుగైదు నెలలుగా సైనికుడు సంబంధిత అధికారుల చుట్టూ తిరుగతున్నాడు. అన్ని పత్రాలు సరిగా ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పైగా కబ్జా దారులకే అధికారులు అండగా ఉంటున్నారని జవాన్ ఆరోపించారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా లాభం లేకుండా పోయిందని వాపోయాడు. ఇక చేసేది లేక హైకోర్టును ఆశ్రయించాడు మోహన్. కేసులో పిల్ వేసినప్పటికీ కబ్జా భూమిపై ఆక్రమణదారులు పెత్తనం చెలాయిస్తూనే ఉన్నారని వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు.
ఈ విషయమై జవాన్ మోహన్‌తో పాటు ఆయన సోదరుడు పలు వీడియోల్లో ప్రస్తావించారు. అంతేకాదు కబ్జాలపై ప్రశ్నించిన వారిని తిడుతూ వారిని కత్తులతో బెదిరిస్తున్నారని కూడా వారు పేర్కొన్నారు. దానికి సంబంధించిన ఫోటోలను కూడా ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. 2023లో భూములు ఆక్రమించారని ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకూ ఎమ్మార్వో, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పై విమర్శలు వినవస్తున్నాయ. ఇప్పటికైనా సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లు.. దీనిపై వెంటనే స్పందించి, సమస్యను త్వరగా పరిష్కరించాలని ఆ జవాన్ కోరారు.
కాగా జవాన్ తన భూమిని ఆక్రమించిన వారిని గురించి వివరిస్తూ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది ఏపీ మంత్రి నారా లోకేష్ దృష్టికి వెళ్లడంతో ఆయన స్పందించారు. తన టీమ్ ఈ విషయంలో తగిన సహాయం చేస్తారని, పూర్తి వివరాలు తీసుకుని న్యాయం చేస్తారని పోస్ట్ చేశారు. కాగా దేశం కోసం పోరాడుతున్న సైనికుని భూమిని ఆక్రమించినవారిపై చర్యలు తీసుకోవాలని పలువురు నెటిజన్లు కోరుతున్నారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025