ఎన్టీఆర్ జిల్లా గుంటుపల్లిలో దారుణం జరిగింది. డాన్ బోస్కో స్కూల్ లో పనిచేస్తున్న లేడీ టీచర్ ప్రిన్సిపల్ విజయ ప్రకాష్ పై యాసిడ్ దాడి చేసింది. ఆమెను విధుల నుంచి తొలగించారనే కోపంతో ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది
AP News: విధుల నుంచి తొలగించారని పాఠశాల ప్రిన్సిపల్ పై యాసిడ్ దాడికి తెగబడింది ఓ లేడీ టీచర్. ఈ దారుణ ఘటన ఎన్టీఆర్ జిల్లా గుంటుపల్లిలోని డాన్ బోస్కో స్కూల్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇబ్రహీంపట్నానికి చెందిన ప్రియదర్శిని అనే మహిళా గుంటుపల్లిలోని డాన్ బోస్కో స్కూల్ లో ఉపాధ్యాయినిగా పనిచేస్తోంది. అయితే ఈమె విద్యార్థులను కొడుతున్నట్లు తరచూ ప్రిన్సిపల్ విజయ్ ప్రకాష్ కి ఫిర్యాదులు వెళ్లాయి
ప్రిన్సిపల్ పై యాసిడ్ దాడి
దీంతో ప్రిన్సిపల్ విజయ్ ప్రకాష్ ఆమెను విధుల నుంచి తొలగించారు. ఈ విషయంపై ప్రిన్సిపల్ తో మాట్లాడేందుకు సోమవారం స్కూల్ కు వచ్చిన ప్రియదర్శిని దారుణానికి పాల్పడింది. ప్రిన్సిపల్ మాట్లాడుతుండగా అతడిపై యాసిడ్ తో దాడి చేసింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రిన్సిపాల్ ను చికిత్స నిమిత్తం గొల్లపూడిలోని ఆంధ్రా ఆస్పత్రికి కు తరలించారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025