గుంటూరు: గుంటూరులో మత్తుమందు సేవిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో 10 గ్రాముల ఎండీఎంఏ మత్తుమందును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ న్ను బెంగళూరు నుంచి గుంటూరుకు తీసుకు వచ్చినట్టు పోలీసులు గుర్తించారు.
గుంటూరులో సాయిక్రిష్టనగర్ లోని ఒక అపార్ట్మెంట్లో మత్తుమందు సేవిస్తున్నారనే సమాచారంతో పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. ఈ క్రమంలో ఎండీఎంఏ మత్తు మందును సేవిస్తూ, విక్రయిస్తున్న ఇంజనీరింగ్ విద్యార్థులతో సహా డ్రగ్స్ ముఠాను అరెస్ట్ చేశారు. తొమ్మిది మందిని అరెస్ట్ చేసి 10.67 గ్రాముల ఎండీఎంను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో బెంగుళూరు నుంచి గుంటూరుకు ఇంజనీరింగ్ విద్యార్థి సాయిక్రిష్ణ డ్రగ్స్ తరలిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు
దాడుల సందర్భంగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎండీఎం మత్తుమందును ఒక గ్రామును 1400 రూపాయలకు కొనుగోలు చేసి సాయి క్రిష్ట్ర దాన్ని ఐదు వేలకు అమ్ముతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ ముఠాలో మొత్తం 11 మంది నిందితులు ఉండగా.. వారిలో ఇద్దరు తప్పించుకున్నారు. వారి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025