అనకాపల్లి జిల్లా యలమంచిలిలో రెండేళ్ల క్రితం యువతి హత్య కేసును పోలీసులు ఛేదించారు. యువతిని హత్య చేసిన కేసులో యలమంచిలి పట్టణానికి చెందిన రవితేజ, ఎస్ సాయి కృష్ణ, బంగారి శివ అనే ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు డిఎస్పి విష్ణు స్వరూప్ తెలిపారు.
AP Crime: అనకాపల్లి జిల్లా యలమంచిలిలో రెండు సంవత్సరాల క్రితం జరిగిన ఓ యువతి హత్య కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో డిఎస్పి విష్ణు స్వరూప్ వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే.. 2023 ఫిబ్రవరి 2న యలమంచిలి పట్టణ సమీపంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న బిపిసిఎల్ పెట్రోల్ బంక్ దగ్గర పూడిమడక గ్రామానికి చెందిన యువతి ఎల్లబిల్లి దివ్యను గుర్తు తెలియకుండా హత్య చేసి తగలబెట్టిన సంఘటన చోటుచేసుకుంది.
ముగ్గురు నిందితుల అరెస్ట్..
అప్పట్లో పోలీసులు ఈ కేసును నమోదు చేసినప్పటికీ నిందితులు ఎవరో గుర్తించ లేకపోయారు. అయితే గత కొద్ది నెలలుగా ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యలమంచిలి పోలీసులు, సీఐ ధనుంజయరావు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కేసులో కీలక ఆధారాలను సేకరించారు. చివరికి పట్టణానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ప్రగడ రవితేజ, ఎస్. సాయికృష్ణ, బంగారి శివలను నిందితులుగా గుర్తించి అరెస్ట్ చేశారు.
డిఎస్పి విష్ణు స్వరూప్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ముగ్గురు నిందితులు దివ్యను హత్య చేసిన అనంతరం దారుణంగా తగలబెట్టి మృతదేహాన్ని గుర్తుపట్టలేని విధంగా మార్చారని వెల్లడించారు. పోలీసులు ఆధారాలను శ్రద్ధగా విశ్లేషించి టెక్నికల్ సపోర్ట్‌తో నిందితుల అనుసంధానాన్ని నిరూపించారు. వీరిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరచారు. ఈ కేసు ఛేదనలో ముఖ్యపాత్ర వహించిన సీఐ ధనుంజయరావు, ఎస్ఐ సావిత్రిలను డీఎస్పీ ప్రశంసించారు. పోలీసుల కృషి, నిబద్ధత వల్ల రెండు సంవత్సరాలుగా విచారణలో ఉన్న హత్య కేసు పరిష్కారమై బాధిత కుటుంబానికి న్యాయం జరగడం గమనార్హం.
Also read
- ఎంత ఘోరం.. ఎంత ఘోరం..ఒకే ఇంట్లో ముగ్గురిని బలితీసుకున్న నిప్పుల కుంపటి!
- Andhra Pradesh: అయ్యో బిడ్డా.. చిన్నారి ప్రాణం తీసిన జింక బొమ్మ.. స్కూల్లో ఆడుకుంటుండగా అనంతలోకాలకు..
- Tirumala Laddu Case: కీలక సూత్రధారులు వారే.. తిరుమల కల్తీ నెయ్యి కేసులో సంచలన నిజాలు..
- Andhra Pradesh: ఇన్స్టాలో చాటింగ్.. అర్ధరాత్రి అబ్బాయి ఇంటికి వెళ్లిన బాలిక.. ఆ తర్వాత జరిగింది తెలిస్తే..
- బయటనుంచి చూస్తే రేకుల షెడ్డు.. లోపలికెళ్తే మైండ్ బ్లాక్.. అసలు మ్యాటర్ తెలిస్తే..





