SGSTV NEWS
Andhra PradeshCrime

Ap Crime News: ఆంటీతో అక్రమ సంబంధం.. పొట్టు పొట్టు కొట్టుకున్న గ్రామస్తులు


చిత్తూరు జిల్లా పుంగనూరులో అక్రమసంబంధం ఘటన సంచలనం రేపింది. కర్నాటకకు చెందిన హరితో గాయత్రి లేచిపోయింది. 15రోజులకు తిరిగి రావడంతో భర్త పంచాయతీ పెట్టించి, పోలీసులతో కౌన్సిలింగ్ ఇప్పించాడు. ఆపై హరి వర్గంపై గాయత్రి భర్త దాడి చేయగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

రోజు రోజుకూ భార్య భర్తల మధ్య సంబంధాలు మంటగలుస్తున్నాయి. కొందరు అక్రమ సంబంధాలతో తమ జీవితాన్ని మధ్యలోనే ముగించుకుంటున్నారు. సంతోషకరమైన జీవితం, పిల్లలు, పరువు, కుటుంబం వంటివి ఆలోచించకుండా వేరొకరితో ఎఫైర్ పెట్టుకుని.. చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి ఏపీలోని చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది.

వివాహిత అక్రమ సంబంధం
చిత్తూరు జిల్లా పుంగనూరులో వివాహిత అక్రమ సంబంధం ఘటన సంచలనంగా మారింది. ఇప్పుడీ అక్రమ సంబంధం వ్యవహారం గొడవకు దారి తీసింది. కర్నాటకలోని రాయలపాడుకు చెందిన హరితో.. చిత్తూరు జిల్లా రామసముద్రానికి చెందిన గాయత్రితో అక్రమ సంబంధం ఏర్పడింది. ఇలా కొంతకాలం వీరి వ్యవహారం సాగింది

ఇక చూసి చూసి గాయత్రి- 15 రోజుల క్రితం హరితో లేచిపోయింది. మళ్లీ ఏమైందో ఏమో కానీ తిరిగి ఇంటికి వచ్చేసింది. అనంతరం గాయత్రి భర్త పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టాడు. దీంతో ఈ ఇల్లీగల్ రిలేషన్‌షిప్ ఆ- గ్రామంలో రచ్చకు దారి తీసింది. ఆపై ఇరు వర్గాలు గొడవకు దిగారు. అనంతరం రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలకు కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించేశారు.

శనివారం రాత్రి మరోసారి ఇరు వర్గాల మధ్య తీవ్రమైన ఘర్షణ జరిగింది. ఈ గొడవలో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ గొడవ- సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Also read

Related posts

Share this