SGSTV NEWS
Andhra PradeshCrime

AP CRIME: నెల్లూరులో ఘోరం.. ఏడేళ్ల బాలుడిని గొంతు నులిమి.. చంపింది వాళ్లేనా?


నెలూరు జిల్లా నాయుడుపేటలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వెంకటకృష్ణ, తులసి దంపతుల చిన్నారి లోకేశ్ (7) ని గుర్తు తెలియని వ్యక్తులు గొంతునులిమి హత్య చేశారు. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయం చూసి ఈ దారుణానికి ఒడిగట్టారు

నెల్లూరు జిల్లాలోని నాయుడుపేటలో వరుసగా జరిగిన హత్యలు స్థానిక ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నాయి. మూడేళ్ల క్రితం తమ కుమార్తెను కోల్పోయిన వెంకటకృష్ణ, తులసి దంపతులకు ఇప్పుడు తమ ఏడేళ్ల కుమారుడు లోకేశ్‌ను కూడా పోగొట్టుకున్నారు. వెంకటకృష్ణ, తులసి దంపతులు ఇంట్లో లేని సమయం చూసి దుండగులు బాలుడి గొంతునులిమి చంపేశారు. ఈ ఘటన జిల్లావ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ దారుణం వెనుక ఎవరున్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

వరుసగా రెండో హత్య..
లోకేష్, అతని సోదరి ఇద్దరూ ఒకే తరహాలో మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ హత్యలకు బయటి వ్యక్తుల ప్రమేయం ఉందా, లేక కుటుంబ బంధువుల పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. స్థానికుల నుంచి, కుటుంబ సభ్యుల నుంచి వివరాలను సేకరించి నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి.. ఆధారాలను సేకరించిన పోలీసులు ఈ హత్య వెనుక గల కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇది కూడా చదవండి: మహిళా డాక్టర్ ప్రాణం తీసిన సైబర్ నేరగాళ్లు.. హైదరాబాద్‌లో దారుణం!

ఇప్పటికే హత్యకు గురైన లోకేశ్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఈ దారుణానికి ఎవరు కారణం, దీని వెనక గల ఉద్దేశ్యం ఏంటనేది త్వరలోనే బయటపెడతామని తెలిపారు. ఒకే కుటుంబంలో ఇలాంటి విషాదం రెండుసార్లు జరగడంతో స్థానిక నాయుడుపేట ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది.

Also read

Related posts

Share this