ఏపీలో విషాదం చోటుచేసుకుంది. కడప జిల్లా మల్లేపల్లిలో ఈతకు వెళ్లిన ఐదుగురు చిన్నారులు గల్లంతయ్యారు. గజ ఈతగాళ్లతో పోలీసులు చెరువులో గాలిస్తుండగా పేరెంట్స్ కన్నీరుమున్నీరవుతున్నారు. పిల్లలను తరుణ్, చరణ్, పార్థు, హర్ష, దీక్షిత్‌గా గుర్తించారు.
.AP Crime: ఏపీలో విషాదం చోటుచేసుకుంది. కడప జిల్లా మల్లేపల్లిలో ఈతకు వెళ్లిన ఐదుగురు చిన్నారులు గల్లంతయ్యారు. గజ ఈతగాళ్లతో పోలీసులు చెరువులో గాలిస్తుండగా పేరెంట్స్ కన్నీరుమున్నీరవుతున్నారు. పిల్లలను తరుణ్, చరణ్, పార్థు, హర్ష, దీక్షిత్‌గా గుర్తించారు. అయితే గట్టుపై వారి దుస్తులు చూసి నీటిలో మునిగిపోయి ఉంటారని భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వినుకొండ మండలం శివాపురం వద్ద లారీని మినీ లారీ గట్టిగా ఢీకొట్టింది. ఇవాళ (మంగళవారం) ఉదయం జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఐదుగురు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను వెంటనే సమీప హాస్పిటల్‌కు తరలించారు.
విజయవాడ – మచిలీపట్నం హైవేపై కూల్‌డ్రింక్స్ కేసులతో వెళ్తున్న ఒక వ్యాన్ బోల్తా పడింది. అతి వేగంగా వెళ్లడంతో ఒక్కసారిగా టైర్ పేలింది. ఈ ఘటనతో కూల్ డ్రింక్స్ తీసుకెళ్తున్న వ్యాన్ బోల్తా పడింది. అదే సమయంలో వ్యాన్‌లో ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మరోవైపు వ్యాన్‌లో ఉన్న డ్రింక్స్ రోడ్డుపై చెల్లా చెదురుగా పడిపోవడంతో అటువైపుగా వెళ్తున్న వాహన దారులు.. డ్రింక్స్ కేసులను తీసుకుని వెళ్తున్నారు. ఎవరికి ఎన్ని డ్రింక్స్ దొరికితే అన్నింటినీ పట్టుకుని పరుగులు పెడుతున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Also read
- Auspicious Yogas: ఈ నెల 21న అరుదైన యోగాలు.. దీర్ఘాయువు, ఆయుస్సు కోసం ఎలా పుజించాలంటే..
- Brahma Muhurta: బ్రహ్మ ముహూర్తంలో మేల్కొంటే ఎన్ని లాభాలో తెలుసా . . ఏ పనులను శుభప్రదం అంటే..?
- నేటి జాతకములు..19 జూలై, 2025
- Visakhapatnam Kidney Racket: అందమైన సాగరతీరంలో కిడ్నీ రాకెట్ కలకలం..! విచారణలో విస్తుబోయే వాస్తవాలు..
- Andhra News: ఉద్యోగం వదిలి వచ్చి పెళ్లైన వ్యక్తితో కూతురు ప్రేమాయణం.. తల్లిదండ్రులు ఏం చేశారంటే!