విశాఖపట్నం జిల్లా మధురవాడ సబ్ రిజిస్ట్రార్ చక్రపాణిని బెదిరించిన నకిలీ ఏసీబీ అధికారి బలగ సుధాకర్ కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. సుధాకర్ వెనుక బాపట్ల జిల్లాలో ఏఆర్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న స్వర్ణలత ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
AP Crime : విశాఖపట్నం జిల్లా మధురవాడ సబ్ రిజిస్ట్రార్ చక్రపాణిని బెదిరించిన నకిలీ ఏసీబీ అధికారి బలగ సుధాకర్ కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. సుధాకర్ వెనుక బాపట్ల జిల్లాలో ఏఆర్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న స్వర్ణలత ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. స్వర్ణలత గతంలో నోట్లమార్పిడి కేసులో అరెస్ట్ అయి జైలుకు కూడా వెళ్లి వచ్చింది. అయినా తన తీరు మాత్రం మార్చుకోలేదని తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం..
శ్రీకాకుళం జిల్లా పాతపట్నానికి చెందిన బలగ సుధాకర్ చాలాకాలంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ విశాఖలోని ఆదర్శనగర్ పాత డెయిరీఫాం వద్ద నివాసం ఉంటున్నాడు. ఇటీవల మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లిన సుధాకర్ జాయింట్ సబ్‌రిజిస్ట్రార్ చక్రపాణిని కలిశాడు. తనను తాను ఏసీబీ ఇన్స్పెక్టర్నని పరిచయం చేసుకున్నాడు. ఈ సందర్భంగా చక్రపాణితో మాట్లాడుతూ మీ ఆఫీస్‌లో అవినీతి జరుగుతుందని తమకు చాలా ఫిర్యాదులు అందాయని వాటిపై కేసులు నమోదు చేస్తామని బెదిరించాడు. త్వరలోనే మీ ఆఫీసులో ఏసీబీ రైడ్ జరగబోతోందని, తనకు రూ.5 లక్షలు ఇస్తే దాడుల జరగకుండా చూసుకుంటానని నమ్మబలికాదు.
అదే సమయంలో ప్రస్తుతం బాపట్ల రిజర్వ్ పోలీస్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న స్వర్ణలతను ఏసీబీ ఎస్పీగా పేర్కొంటూ చక్రపాణిని మభ్యపెట్టాడు. అంతేకాక స్వర్ణలతతో మాట్లాడించాడు. ‘ఏసీబీ దాడుల నుంచి ముప్పు లేకుండా ఉండాలంటే సుధాకర్ కోరినట్లుగా రూ. 5 లక్షలు ఇచ్చేయండి’ అంటూ ఆమె కూడా చక్రపాణికి ఫోన్లో తెలపడం గమనార్హం. కాగా సుధాకర్ తీరుపై అనుమానం వచ్చిన చక్రపాణి పీఎం పాలెం పోలీసులకు సమాచారం ఇచ్చారు. సుధాకర్‌ను అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం బయటపడింది.
ఈ ఘటనలో లేడీ పోలీస్ స్వర్ణలత ఉన్నట్లు పోలీసులు తేల్చారు. గతంలో సస్పెండ్ అయ్యి జైలుకి వెళ్లొచ్చినా ఆమె వ్యవహార శైలిలో మార్పురాలేదని పోలీసులు తెలిపారు.. నకిలీ ఏసీబీ ఇన్స్పెక్టర్ సుధాకర్‌ను అడ్డుపెట్టుకుని డబ్బు కోసం సబ్ రిజిస్ట్రార్‌ని బెదిరించినట్లు తేల్చారు. సుధాకర్ కాల్ లిస్ట్ ద్వారా స్వర్ణలత బండారాన్ని బయటపెట్టారు. ప్రస్తుతం బాపట్ల జిల్లాలో ఏఆర్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న స్వర్ణలత కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు
ప్రస్తుతం బాపట్ల ఏఆర్ ఇన్స్పెక్టర్గా ఉన్న స్వర్ణలత గతంలో 2000 రూపాయల నోట్ల మార్పిడి కేసులో అరెస్టయ్యారు. సినిమాల్లో నటించాలన్న పిచ్చితో స్వర్ణలత నటనలో శిక్షణ తీసుకోవడమే కాదు… డ్యాన్సులు కూడా నేర్చుకుంది.. అంతేకాదు ఏపీ 31పేరుతో ఓ సినిమా పోస్టర్‌ను సైతం రిలీజ్ చేశారు. ఆమె డ్యాన్స్ వీడియోలు, సినిమా పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అరెస్టవ్వడంతో కొన్నాళ్లు సైలెంట్‌గా ఉన్నా స్వర్ణలత.. మళ్లీ దందాలకు పాల్పడుతున్నట్లు తేల్చారు పోలీసులు. ఆమెకు ఇంకా సినిమా పిచ్చి పోకపోవడంతో సినిమా తీయాలనే కోరికతోనే అక్రమ వసూళ్లకు తెరలేపిందని పోలీసులు తెలిపారు
Also read
- Vijayawada:పోలీస్ ల నుండి తప్పించుకునేందుకు.. అపార్ట్మెంట్ పైనుంచి దూకేసిన యువకుడు
- Guntur: కాల్ బాయ్‌గా చేస్తే సూపర్ ఇన్‌కం.. టెమ్ట్ అయి కమిటయిన కొందరు.. ఆ తర్వాత
- Hyderabad: చదువుకోమని తల్లి మందలించిందని..
- Crime News: కరీంనగర్లో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై వీడియో తీసి..
- BIG BREAKING: తెనాలిలో కలకలం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య!