విశాఖ జిల్లా అనకాపల్లిలో నాలుగేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసిన ఘటన సంచలనంగా మారింది. లోకావారి వీధిలో ఆడుకుంటున్న లోహిత అనే చిన్నారిని ఓ మహిళ ఎత్తుకెళ్లినట్లు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

AP Crime: అనకాపల్లిలోని లోకావారి వీధిలో కిడ్నాప్ ఘటన సంచలనంగా మారింది. నాలుగేళ్ల చిన్నారి లోహిత తన ఇంటి ముందు ఆడుకుంటుండగా గుర్తు తెలియని మహిళ వచ్చి ఆమెను ఎత్తుకెళ్లిన ఘటన స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటన మే 16 వ తేదీన మధ్యాహ్నం సమయంలో జరిగింది. చిన్నారి అదృశ్యం కావడంతో కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనకు గురై వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు
సీసీ కెమెరాల ఆధారంగా..
సదరు మహిళ చిన్నారితో కలిసి పెరుగు బజార్ జంక్షన్‌కు చేరుకుని అక్కడి నుంచి బస్సులో ఎక్కిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. బస్సు ఎక్కే సమయంలో ఆమె తలపై ఓ చెక్క బ్యాగు, చేతిలో చిన్నారి ఉండటం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఆధారాలను పరిశీలించిన పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అనుమానిత మహిళను గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ మహిళ ఏ బస్సు ఎక్కింది? ఎటు వైపు వెళ్లింది? ఎందుకు కిడ్నాప్ చేసింది? అన్న కోణంలో విచారణ చేస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా ఈ కేసును ఛేదిస్తామని పోలీసులు చెబుతున్నారు.
Also read
- Weekly Horoscope: ఆర్థిక వ్యవహారాల్లో వారికి అనుకూలత.. 12 రాశుల వారికి వారఫలాలు
- Andhra Pradesh: ఇలా ఉన్నారేంట్రా.. గోల్డ్ షాపు ఓనర్ కళ్లలో కారం కొట్టి ఇతడు ఏం చేశాడో చూడండి..
- Ugadi 2026: పరాభవ నామ సంవత్సరం అర్థం ఏమిటి..? మనకు ఇచ్చే రహస్య సందేశం ఏంటో తెలుసా..?
- టార్గెట్ ఒకరు.. ప్రాణం పోయింది మరొకరిది.. బట్టల తీగకు కరెంట్ షాక్ పెట్టి హత్య
- దేవాయంలో ప్రదక్షిణలు ఎందుకు చేస్తారు..? ఏ దేవుడికి ఎన్ని ప్రదక్షిణలు చేయాలో తెలుసా..?





