విజయవాడ పాయకాపురంలో 7వ తరగతి విద్యార్థినిపై వరుసకు బాబాయ్ అయిన వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆరేళ్ల క్రితం బాలిక తల్లిదండ్రులు చనిపోవడంతో పిన్ని, బాబాయ్ దగ్గరే ఉంటోంది.
AP Crime: దేశంలో మరో అమానుష ఘటన జరిగింది. ఇప్పటికే ప్రభుత్వాలు అత్యాచార ఘటనలపై కఠిన చర్యలు తీసుకుంటున్నా కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు. శిక్షలు పడుతున్నా తమకేం పట్టనట్లే ఆడపిల్లలను ఆగం చేస్తున్నారు. బయటరక్షణ లేదని బయపడుతున్న పేరెంట్స్‌కు ఇప్పుడు ఇంట్లో కూడా సెక్యూరిటీ లేకుండా పోతోంది. అన్నా, బావ, మామ, బాబాయ్ ఎవరిని నమ్మే పరిస్థితిలేకుండా పోతోంది. తాజాగా అభంశుభం తెలియని 12 ఏళ్ల బాలికపై ఇంట్లో బాబాయ్ లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఏపీ విజయవాడలో కలకలం రేపుతోంది. స
ఆనాధను చేరదీసి..
ఈ మేరకు బాధిత కుటుంబం, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాయకాపురంలో 7వ తరగతి విద్యార్థినిపై వరుసకు బాబాయ్ అయిన వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆరేళ్ల క్రితం బాలిక తల్లిదండ్రులు చనిపోవడంతో పిన్ని, బాబాయ్ దగ్గరే ఉంటోంది. వారే తమ పేరెంట్స్ గా భావిస్తూ భరోసాతో ఉంటోంది. అయితే ఈ క్రమంలో ఆ చిన్నారిపై కన్నేసిన కామాంధ బాబాయ్.. బెదిరింపులకు గురిచేస్తూ లొంగదీసుకున్నాడు. ఇంట్లో ఎవరూలేని సమయంలో పలుసార్లు కామవాంఛ తీర్చుకున్నాడు. ఇటీవల బాలిక తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో ఆస్పత్రికి తరలించారు. వైద్యపరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఒక్కసారిగా కంగుతిన్నారు. ఆ చిన్నారి గర్భం దాల్చినట్లు నిర్ధారించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బాలిక ఫిర్యాదు మేరకు నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
ఇదిలా ఉంటే.. గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నఓ ప్రేమజంట(love-couple) తమ పెళ్లిని పెద్దలు అంగీకరించలేదని దారుణమైన నిర్ణయం తీసుకుంది. రైల్వేట్రాక్‌పై ఆ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుంటూరు జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. జిల్లాలోని పేరేచర్ల రైల్వే ట్రాక్‌పై ఆ జంట ఆత్మహత్య(lovers-suicide)కు పాల్పడింది. ప్రేమికులిద్దర్ని గోపి, ప్రియాంకగా గుర్తించారు.
Also read
- Medak: ప్రేమ పెళ్లి.. పేరెంట్స్‌ను కౌన్సిలింగ్‌కు పిలిచిన పోలీసులు.. ఆపై ఊహించని సీన్..
- Hyderabad: కుటుంబ సమేతంగా ఆత్మహత్యాయత్నం.. ఒక్క ఫోన్ కాల్ జీవితాలనే మార్చేసింది..!
- Ratha Saptami 2026: దరిద్రం వదిలి ఐశ్వర్యం వస్తుంది!.. రథ సప్తమి నాడు ఏ రాశి వారు ఏం దానం చేయాలి?
- Moon Transit: చంద్ర సంచారం.. ఈ మూడు రాశులకు జాక్‌పాట్.. ఊహించని లాభాలు!
- భార్యను చంపేశానంటూ పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన భర్త.. విచారణలో సంచలనాలు..!





