తిరుపతి జిల్లా పాకాల మండలం మద్దినాయినిపల్లెలో దారుణం చోటు చేసుకుంది. గిరి అనే వ్యక్తి భార్య, ఇద్దరు కుమార్తెలను బావిలో తోసి చంపేశాడు. ముగ్గుర్నీ హత్య చేసిన తర్వాత గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.
AP Crime: తిరుపతి జిల్లా పాకాల మండలం మద్దినాయినిపల్లెలో దారుణ ఘటన జరిగింది. గిరి అనే వ్యక్తి తన కుటుంబాన్ని ఘోరంగా హతమార్చిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. అనుమానాస్పద స్థితిలో అతడు తన భార్యను, ఇద్దరు కుమార్తెలను బావిలో తోసేసి హతమార్చాడు. ఈ సంఘటన మండలంలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. కుటుంబ కలహాలే దీనికి కారణంగా భావిస్తున్నారు. భార్యను, ఇద్దరు పసిబిడ్డలను బావిలోకి తోసిన గిరి, అనంతరం తన గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు గమనించి అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
కుటుంబంపై భర్త ఘాతుకం:
గిరి కుటుంబంలో కలహాలు కొనసాగుతున్నట్లు అనుమానిస్తున్నారు. అందుకే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. అతడి భార్యతో కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నట్లు తెలిసినప్పటికీ.. ఇటువంటి ప్రాణహానికి దిగతాడని ఎవరు ఊహించలేకపోయామని గ్రామ ప్రజలు అంటున్నారు. గిరి భార్య, కుమార్తెల మృతదేహాలను గ్రామస్తులు బయటకు తీశారు. ఈ ఘటనను చూసిన వారంతా విషాదంలో మునిగిపోయారు. మృతులు గిరి భార్య, ఇద్దరు పిల్లల ప్రాణాలు క్షణాల్లో కోల్పోయారు. గ్రామస్థులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. గిరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతను కోలుకున్న తరువాత పూర్తి విచారణ చేసి అసలు కారణాలను వెలుగులోకి తీసుకురానున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన పాకాల మండలంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో తీవ్ర కలకలం రేపింది. మద్దినాయినిపల్లెలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబాన్ని మొత్తం పోగొట్టుకున్న ఘటనపై స్థానికులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఓ తండ్రి చేతిలో కుటుంబం అంతమవడం హృదయవిదారకంగా మారింది.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025