February 3, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

AP: ఏపీలో దారుణం.. సిబ్బంది నిర్లక్ష్యానికి గర్భిణి మృతి..!


ఏపీలోని అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఏరియా హాస్పిటల్‌లో దారుణం జరిగింది. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా గర్భిణి మృతి చెందింది. ఉమ్మనీరు, రక్తం కలిసిపోవడం వల్లే అలా జరిగిందని డాక్టర్లు చెబుతున్నారు. భార్య మృతి చెందడంతో ఆమె భర్త స్పృహ కోల్పోయాడు.

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఏరియా హాస్పిటల్‌లో దారుణం జరిగింది. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా గర్భిణి మృతి చెందింది. దీంతో గర్భిణీ కుటుంబ సభ్యులు, బంధువులు హాస్పిటల్ వద్ద ఆందోళన చేస్తున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు వారిని అదుపు చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ప్రసవం కోసం ఏరియా హాస్పిటల్‌కు


ఎస్ రాయవరం మండలం చిన గుమ్ములూరు గ్రామానికి చెందిన కంటే నానాజీ తన భార్య దేవిని ప్రసవం కోసం సోమవారం రాత్రి నర్సీపట్నం ఏరియా హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. అయితే ఆసుపత్రి సిబ్బంది నార్మల్ డెలివరీ అవుతుందని.. కంగారు పడవద్దని చెప్పారు. అనంతరం ప్రసవ వార్డులో చేర్పించుకున్నారు. ఇక హాస్పటల్లో చేర్చిన తర్వాత నుంచి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని గర్భిణీ స్త్రీ మృతురాలు దేవి బంధువులు ఆందోళన చేస్తున్నారు.

సిబ్బంది వైద్యం చేశారు
డ్యూటీ డాక్టర్ రాకుండా సిబ్బంది వైద్యం చేశారని చెబుతున్నారు. ఎన్నిసార్లు చెప్పినా వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని.. గర్భవతిని తనిఖీ చేయడానికి రాకపోవడం వల్లే మంగళవారం ఉదయం ఆమె చనిపోయిందని దేవి బంధువులు ఆరోపిస్తున్నారు. ఇక మొదటి కాన్పు నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలోనే జరిగిందని అందుకే నర్సీపట్నం తీసుకొచ్చామని చెబుతున్నారు.

వైద్యులు సకాలంలో స్పందించి ఉంటే తల్లి బిడ్డ బతికేవారని మృతురాలు బంధువులు కన్నీరు మున్నీరు చెందుతున్నారు. హాస్పిటల్ వార్డులోనే మృతదేహాన్ని ఉంచి బంధువులు ఆందోళన చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి వారికి సర్ది చెబుతున్నారు. ఏరియా హాస్పటల్ సూపరిండెంట్ సత్యనారాయణ ఈ ఘటనపై స్పందించారు.

ఉమ్మనీరు, రక్తం కలిసిపోవడం వల్లే
వైద్యం సక్రమంగానే అందించామని లక్షల్లో ఒక కేసు ఇలా జరుగుతూ ఉంటుందని అన్నారు. అలాగే రాత్రి డ్యూటీలో ఉన్న డాక్టర్ చేతన మీడియాతో మాట్లాడారు. తాము సకాలంలో వైద్యం అందించామని, మృతిచెందిన దేవి పరిస్థితి అంతా సక్రమంగానే ఉందని తెలిపారు. అయితే చివరి క్షణంలో ఉమ్మనీరు, రక్తం కలిసిపోవడం వల్లే అలా జరిగిందని డాక్టర్ చేతన్ చెప్పుకొచ్చారు. ఇక భార్య మృతి చెందడంతో ఆమె భర్త నానాజీ స్పృహ కోల్పోయాడు.

Also Read

Related posts

Share via