SGSTV NEWS online
Andhra PradeshCrime

కుమార్తెలను కాటేసిన కామాంధుడు

భర్త అఘాయిత్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య


నిమ్మనపల్లె (అన్నమయ్య జిల్లా) : అల్లారుముద్దుగా పెంచి అందమైన జీవితాన్ని ఇవ్వాల్సిన తండ్రే తన ఇద్దరు ఆడపిల్లలపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అన్నమయ్య జిల్లా, నిమ్మనపల్లి మండలం కొండయ్యగారిపల్లి పంచాయతీ వెంకోజిగారిపల్లి శివాజీ నగర్‌లో ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శివాజీనగర్‌కు చెందిన దంపతులకు కొడుకు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. మద్యానికి బానిసై మూడు రోజుల క్రితం పెద్ద కుమార్తెపై, మరుసటి రోజు రెండవ కుమార్తెపై తండ్రి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మూడవరోజు తన ఏడేళ్ల కూతురిపై అఘాయిత్యానికి పాల్పడానికి తీసుకెళ్తుండగా, అత్త గమనించి నిలదీయడంతో కుమార్తెను వదిలేశాడు. నొప్పి ఉందని ఏడుస్తూ తమ బాధను అమ్మమ్మకు, మేనమామకు చిన్నారులు చెప్పుకొచ్చారు. వారు ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. కన్న బిడ్డలపై అఘాయిత్యానికి పాల్పడుతున్న కీచక తండ్రిపై పోలీసులకు తల్లి ఫిర్యాదు చేశారు. కూతుళ్లపై తండ్రి లైంగిక దాడికి పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారణ కావడంతో నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.క



Also read

Related posts