April 3, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

ఏపీలో రూ.7.55 లక్షల పెన్షన్‌ డబ్బులతో పరారైన వెల్ఫేర్‌ అసిస్టెంట్‌..!



Andhra Pradesh: ప్రతి నెల రాగానే వితంతులు, వృద్ధులు పెన్షన్‌ కోసం ఎదురు చూస్తుంటారు. కుటుంబం వారి కుటుంబం గడవడానికి పెన్షన్‌ డబ్బులే ఆధారం. ప్రతి నెల పెన్షన్‌ డబ్బులతోనే వారి జీవన విధానం గడుస్తుంటుంది. అలాంటి పెన్షనర్లకు ఇచ్చే రూ.7.55 లక్షల పెన్షన్‌ డబ్బులతో పరారయ్యాడు ఓ వెల్ఫేర్‌ అసిస్టెంట్‌. వివరాల్లోకి వెళితే..


పెన్షన్‌దారులకు ఇవ్వాల్సిన డబ్బుతో వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ పరారైన ఘటన ఏపీలోని ఎన్టీఆర్‌ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని కంచికచర్లలో పెన్షన్‌దారులకు ఇవ్వాల్సిన పెన్షన్‌ సొమ్ము రూ.7.55 లక్షలతో కంచికచర్ల పట్టణానికి చెందిన వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ తోట తరుణ్ కుమార్ పరారైనట్లు ఎంపీడీవో లక్ష్మీ కుమారి తెలిపారు.

గంపలగూడెం మండలం పెనుగోలనుకు చెందిన తోట తరుణ్ కుమార్ కంచికచర్లలో గత ఆరు నెలలోగా వెల్ఫేర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే పెన్షన్‌దారులకు ఇవ్వాల్సిన ఇవ్వాల్సిన డబ్బును కార్యాలయం నుంచి తీసుకెళ్లాడు. మంగళవారం ఉదయం పెన్షన్‌ దారులకు పెన్షన్‌ డబ్బులు ఇవ్వకపోవడంతో ఎంపీడీవోకు అనుమానం వచ్చి వెంటనే అతనికి ఫోన్‌ చేయగా, స్పందించకపోవడంతో డబ్బులతో పరారై ఉంటాడని భావించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. రూ.7.55 లక్షలు పెన్షనర్లకు ఇవ్వకుండా పరారైన తరుణ్‌ కుమార్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులకు సిఫార్సు చేస్తామని తెలిపారు.

Also Read

Related posts

Share via