విశాఖలో అక్రమంగా ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఎనిమిది మంది నిందితులను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
విశాఖపట్నం, మే 13: విశాఖలో అక్రమంగా ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఎనిమిది మంది నిందితులను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.2 కోట్ల విలువైన ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు, బ్యాంక్ పాస్‌బుక్‌లు, ఇతర డిజిటల్ ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల మొబైల్ డేటా ఆధారంగా పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో దాడి చేసిన విశాఖ పోలీసులు.. ప్రధాన నిందితుడు పఖరాని కరణ్‌తో పాటు ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ ముఠా గోవాను కేంద్రంగా చేసుకుని ఏపీ, కర్ణాటక, యూపీ, మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో టెలిగ్రామ్ ద్వారా బెట్టింగ్ నెట్వర్క్ నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అమాయక యువతను ఆకర్షించి, ఫ్రాంచైజీల రూపంలో అక్రమ లావాదేవీలు జరిపినట్లు విచారణలో బయటపడింది. నిందితులను పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. వారికి న్యాయస్థానం 15 రోజుల రిమాండ్ విధించింది. ఈ సందర్భంగా విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి మాట్లాడుతూ… ఆన్లైన్ బెట్టింగ్‌లకు యువత దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. బెట్టింగ్‌లపై సమాచారం ఉంటే పోలీసులకు తెలపాలని సీపీ వెల్లడించారు.
Also read
- అయ్యో ఎంత పని చేశావ్ తల్లి.. ఉరివేసుకొని 5వ తరగతి బాలిక ఆత్మహత్య.. ఎందుకంటే?
- అయ్యో అనిత.. మరికాసేపట్లో డెలివరీ.. అంతలోనే వైద్యులు వచ్చి ఏం చెప్పారంటే..
- ఎంతకు తెగించార్రా..! రూ.30 వేల అప్పు కోసం 21 రోజుల పసికందు కిడ్నాప్..!
- Hyderabad: అంతా పక్కా స్కెచ్.. బెడిసికొట్టిన ఫ్లాన్.. ఏటీఎం చోరీ కేసులో సంచలన ట్విస్ట్!
- అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్తే.. నువ్వు చనిపోయావ్‌గా అన్నారు.. అసలు ఏమైందంటే..?





