March 12, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

చెత్త కుప్ప చుట్టూ కుక్కల హడావిడి.. మేకల కాపరి వెళ్లి చూసేసరికి.. అమానుషం..!



ఏ తల్లికి భారమో.. లేక మరే తల్లి కర్కశత్వమో గానీ.. లోకం చూడకముందే ఆ శిశువు ఊపిరి వదిలింది. బాహ్య ప్రపంచంలోకి రాగానే తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన ఆ శిశువు.. చెత్తకుప్ప పాలయింది. ఈ అమానుష ఘటన చూసి అందరూ గుండెలు పట్టుకున్నారు. ఈ హృదయవిదారక ఘటన అనకాపల్లి జిల్లాలో చోటు చేసుకుంది.


ఏ తల్లికి భారమో.. లేక మరే తల్లి కర్కశత్వమో గానీ.. లోకం చూడకముందే ఆ శిశువు ఊపిరి వదిలింది. బాహ్య ప్రపంచంలోకి రాగానే తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన ఆ శిశువు.. చెత్తకుప్ప పాలయింది. ఈ అమానుష ఘటన చూసి అందరూ గుండెలు పట్టుకున్నారు.

అనకాపల్లి జిల్లాలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. నక్కపల్లి మండలం చిన్న దొడ్డుగల్లు చెత్తకుప్పలో పసికందు మృతదేహం కనిపించడం స్థానికులను కలచివేసింది. సమాచారం అందుకున్న అధికారులు.. మృత శిశువును స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు.

నక్కపల్లి మండలం చిన దొడ్డిగల్లులో దారుణం.. సభ్య సమాజం తలదించుకునే విధంగా నెలల పసికందు చెత్తకుప్పలో కనిపించింది. హరిజనకాలనీ సమీపంలోని తుప్పల్లో సాయంత్రం ఓ పసికందు మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. అటుగా వస్తున్న మేకల కాపరి చెత్త కుప్ప చుట్టూ కుక్కలు చేరి హడావుడి చేస్తుండటం గమనించాడు. దగ్గరకు వెళ్లి చూసేసరికి ఆ చెత్తకుప్పలో శిశువు మృతదేహం ఉండటంతో స్థానికులకు సమాచారం ఇచ్చాడు. సమాచారం అందుకున్న నక్కపల్లి పోలీసులు, వైద్య శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

ఆ పసికందు కు 5-6 నెలల వయసు ఉండొచ్చని భావిస్తున్నారు. అబార్షన్ ద్వారా బయటపడిన ఈ పసికందును గుర్తు తెలియని వ్యక్తులు పొదల్లో విడిచి పెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. మృత శిశువును పోస్టుమార్టం కోసం నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also read

Related posts

Share via