చేయి చేయి కలిపారు.. తాగునీటి ఎద్దడి ఎదుర్కొనేందుకు నడుం బిగించారు. పూడిక చేరి శిథిలావస్థకు చేరుకున్న పురాతన బావిలో పూడికతీత పనులు చేపట్టారు. ఓ అందమైన పురాతన బావి బయటపడింది. దీంతో గ్రామస్తులు సంకల్పం కూడా నెరవేరింది.. అందమైన పురాతనమైన బావిలో ప్రాచీన శిలాశాసనం కూడా ప్రత్యక్షమైంది.. ఇది ఎక్కడో కాదు.. ఏపీలోని నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం నందిపాడు అనే గ్రామంలో జరిగింది. కొలిమిగుండ్ల మండలం నందిపాడు గ్రామంలోని చౌడేశ్వరి దేవి ఆలయం ముందున్న పురాతన బావి ఒకప్పుడు ఊరందరి తాగునీటి అవసరాలు తీర్చేది. కాలక్రమేన ఆ బావి శిలావస్థకు చేరుకుని పూడికతో నిండిపోయింది.
అయితే.. ఇటీవల గ్రామంలో తాగునీటికి కొరత ఏర్పడింది. దీంతో గ్రామస్తులకు ఒక ఆలోచన వచ్చింది. బావిలోని పూడిక తీస్తే భూగర్భ జలాలు పెరగడంతో పాటు, నీటి అవసరాలు తీరుతాయని ఆ గ్రామస్తులు అందరూ కలిసి పూడికతీత పనులు చేపట్టారు. బావి బయట ప్రత్యేక యంత్రాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా పూడిక తీత పనులు చేపట్టారు. అలా కొన్ని రోజులకు మట్టిలో కురుకుపోయిన ఒక అద్భుతమైన పురాతన బావి కట్టడం బయటపడింది.
బయటపడ్డ శిలాశాసనం
బావి పూడికతీత పనుల్లో ఒక బండ రాయిపై రాసి ఉన్న శిలాశాసనం కూడా బయటపడింది. సంస్కృతంలో రాసి ఉన్న ఈ శిలా శాసనం చౌడేశ్వరి ఆలయం చరిత్రను తెలిపేలా ఉందని స్థానికులు పేర్కొంటున్నారు పురావస్తు శాఖ అధికారులు. ఈ అద్భుతమైన బావి, అలాగే శాసనం గురించి పరిశోధన చేసి.. బాహ్య ప్రపంచానికి తెలిసేలా చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు
Also read
- నరక లోయ ప్రయాణంలో ఆత్మ చేరుకునే ఐదవ పట్టణం శైలాగమం – ఆత్మకు అసలైన నరకం ఇక్కడే కనిపిస్తుందట
- నేటి జాతకములు…27 ఏప్రిల్, 2026
- లక్కీ డ్రాప్ కోసం ఫ్రెండ్స్ డిష్యుం..డిష్యుం.. పోయిన ప్రాణం..!
- కార్మిక చట్టాల అమలు కు దీక్షాదినంగా మేడే….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్.టి.యు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ భయం.. ఫలితాలకు ముందే విద్యార్ధిని ఆత్మహత్య!





