అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం (జనవరి 21) తెల్లవారు జామున మెట్రో కెమ్ ఫార్మా కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టంగా పొగ అలుముకోవడంతో కార్మికులు, చుట్టు పక్కల నివాసమున్న ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మెట్రో కెమ్ ఫార్మా కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఎఫ్లూయెంట్ ట్యాంక్ నుంచి మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. ఈ కారణంగా చుట్టు పక్కల పరిసరాల్లో దట్టంగా పొగ అలముకుంది. ప్రమాదం కారణంగా కార్మికులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పుతున్నారు. ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాలేదని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ ఘటనకు గల కారణాలను విశ్లేషిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా ఈ మధ్యకాలంలో పరవాడ ఫార్మాసిటీలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ప్రాణ నష్టం కూడా జరుగుతోంది. దీంతో కార్మికులతో పాటు చుట్టుపక్కల నివాసముంటోన్న స్థానికులు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గతేడాది నవంబర్ 2, డిసెంబర్ 22 తేదీల్లో ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరిగాయి. ఇప్పుడు మళ్లీ నెల రోజులు కూడా గడవకుండానే మరో అగ్ని ప్రమాదం జరగడం కలకలం రేపుతోంది.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025