April 19, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

Andhra Pradesh: ఇద్దరు అబ్బాయిలు.. ఓ అమ్మాయి.. సినిమా థియేటర్‌లో మరో సినిమా.. చివరకు..




టెంపుల్‌ సిటీ తిరుపతిలో కత్తి కల్చర్‌ హడలెత్తిస్తోంది. తాజాగా PGR సినిమా థియేటర్‌లో సినీ ఫక్కీలో జరిగిన అటాక్‌ సంచలనం రేపింది. లోకేష్‌ అనే యువకుడు ఓ యువతి కలిసి సినిమా చూడ్డానికి వెళ్లారు. షో రన్‌ అవుతోంది. అంతా సినిమా చూస్తున్నారు.. ఈ క్రమంలోనే..




టెంపుల్‌ సిటీ తిరుపతిలో కత్తి కల్చర్‌ హడలెత్తిస్తోంది. తాజాగా PGR సినిమా థియేటర్‌లో సినీ ఫక్కీలో జరిగిన అటాక్‌ సంచలనం రేపింది. లోకేష్‌ అనే యువకుడు ఓ యువతి కలిసి సినిమా చూడ్డానికి వెళ్లారు. షో రన్‌ అవుతోంది. అంతా సినిమా చూస్తున్నారు.. ఈ క్రమంలోనే.. ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బ్యాక్‌ సీట్‌లో కూర్చున్న కార్తీక్‌ అనే యువకుడు సడెన్‌గా కత్తితో లోకేష్‌పై అటాక్‌ చేశాడు. గాయపడిన లోకేష్‌ను హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించారు థియేటర్‌ సిబ్బంది. అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. అయితే లోకేష్‌పై కార్తీక్‌ కత్తితో దాడి చేయడం వెనుక కారణాలేంటన్నది మిస్టరీగా మారింది.


ఇక్కడ మరో ట్విస్ట్‌ ఏంటంటే లోకేష్‌తో సినిమాకు వచ్చిన యువతి.. అతనిపై దాడి చేసిన కార్తీక్‌తో కలిసి బైక్‌ వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. అంటే ఆ ఇద్దరు కలిసి ప్లాన్‌ ప్రకారమే లోకేష్‌పై అటాక్‌ చేశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రేమ వ్యవహారమే ఈ ఘటనకు కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. అయితే.. పోలీసులు భావిస్తున్నట్లు ప్రేమ వ్యవహారమే కారణమా? మరేదైనా కోణం వుందా? అనేది హాట్ టాపిక్ గా మారింది.

లోకేష్‌, కార్తీక్‌ ఇద్దరూ చంద్రగిరి మండలం రంగంపేటలోని పారామెడికల్‌ కాలేజీ విద్యార్థులని గుర్తించారు తిరుపతి ఈస్ట్‌ పోలీసులు.. యువతి, కార్తీక్‌ ఆ ఇద్దరి స్వస్థలం సూళ్లూరుపేట అని గుర్తించారు. ఆ ఇద్దరు కలిసి పక్కా పథకం ప్రకారమే లోకేష్‌పై దాడి చేశారా? అన్నది తేలాల్సి ఉంది. ఈ ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణం కావచ్చని ప్రాథమిక అంచనాకు వచ్చిన పోలీసులు..అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Also read

Related posts

Share via