ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నంద్యాలలో దొంగలు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. గత కొంతకాలంగా దొంగలు చోరీ చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. అదే క్రమంలో చోరీకి వెళ్లి అక్కడ ఏమి దొరక్కపోతే మీ ఇంట్లో మాకు ఏమి దొరకలేదు. డోంట్ వర్రీ.! అంటూ దర్జాగా లెటర్ రాసి పరారైపోతున్నారు. ఇటీవల నంద్యాల శివారులోని చాబోలు గ్రామ సమీపంలోని విఘ్నేశ్వర అగ్రికల్చరల్ డ్రోన్స్ సేల్స్ అండ్ సర్వీస్ ఆఫీసులో చోరీకి పాల్పడ్డారు. ఆఫీసు ప్రధాన ద్వారం తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. అఫీసులోని అన్ని బీరువాలు, కబోర్డులలో తనిఖీ చేశారు. చివరికి ఏమి దొరక్కపోవడంతో ”మీ ఆఫీసులో మాకు ఏమి దొరక్కలేదు. డోంట్ వర్రీ బ్రదర్.!” అని అంటూ ఓ లెటర్ రాసి దర్జాగా అక్కడ నుంచి వెళ్లిపోయారు.
ఉదయం అఫీసుకు వచ్చి చూసిన బాధితుడు దొంగలు ఆఫీసులో చోరీకి యత్నించారని గుర్తించి.. పోలీసులకు సమాచారం అందించాడు. ఆఫీసులోని లక్షల విలువ చేసే డ్రోన్స్, వాటి పరికరాలను దొంగలు అసలు టచ్ కూడా చెయ్యలేదు.కేవలం కార్యాలయంలో ఉన్న 9 వేలు మాత్రం చోరీ చేసినట్లు గుర్తించారు. అంతేకాకుండా దొంగ చోరీ చేసి.. ఇలా లెటర్ రాసి నిజాయితీ దొంగలా బిల్డప్ ఏంటి అని బాధితుడు వాపోతున్నాడు
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025