కర్నూలు జిల్లా పత్తికొండలో మాతృత్వాన్ని మరిచి.. తల్లిని నడిరోడ్డుపై వదిలేసి వెళ్లిపోయాడు కుమారుడు. కాలు విరిగి వీల్ చైర్‌లో ఉన్న తల్లిపై కనీస కనికరం చూపలేదు. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి…
సమాజంలో రోజురోజుకు మానవత్వం మంట కలుస్తోంది. బంధాలు, బంధుత్వాలు మరుగున పడుతున్నాయి. మాతృత్వాన్ని మరిచి పోతున్నారు. నవమాసాలు మోసి.. ప్రాణాలను పణ్ణంగా పెట్టి బిడ్డకు జన్మనిచ్చిన తల్లినే ఇంట్లో నుంచి గెంటివేస్తున్నారు పిల్లలు. రెక్కలు రాగానే తల్లి గూడును వదిలేసిన పక్షి పిల్లలా తయారవుతున్నారు. తల్లిని పోషించలేనంటూ కన్నతల్లినే రోడ్డుపై వదిలేసిన ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది.
కర్నూలు జిల్లా పత్తికొండలో అర్ధరాత్రి తల్లిని నడిరోడ్డుపై వదిలేసి వెళ్లాడు కడుపున పుట్టిన కుమారుడు. కాలు విరిగి వీల్ చైర్‌లో నడవలేని స్థితిలో ఉన్న తల్లిని ఏమాత్రం కనికరం లేకుండా తన సోదరి పాత ఇంటిముందు వదిలేసి పోయాడు. వృద్ధురాలు కుమార్తె ఈమధ్యే ఇల్లు ఖాళీ చేసి వేరే చోటుకు వెళ్లడంతో ఆ ఇంటి ముందు రాత్రంతా చలిలో వణుకుతూనే ఉంది. ఉదయాన్నే ఆమెను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే వృద్ధురాలు పార్వతమ్మను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
గతంలో పార్వతమ్మ తనకు వచ్చే ఫించన్‌తో వృద్ధాశ్రమంలో జీవించేంది. ప్రమాదవశాత్తు ఆమెకు కాలు విరగడంతో వృద్ధాశ్రమం నుంచి పార్వతమ్మ తీసుకెళ్లాలని కుమారుడు శ్రీనివాసులకు ఫోన్ చేసి చెప్పారు. తల్లిని పోషించలేనంటూ తన ఇంటికి తీసుకెళ్లకుండా తన అక్క ఇంటి దగ్గర వదిలేసి వెళ్లాడు వృద్ధురాలు పార్వతమ్మ కుమారుడు. కూతుర్ల దగ్గర డబ్బులు తీసుకురావాలని తనను ఇబ్బంది పెడుతున్నాడని పార్వతమ్మ చెబుతోంది.
తమ దగ్గర డబ్బు తీసుకురావాలని తన తమ్ముడు తల్లిని వేధిస్తున్నారని పార్వతమ్మ కుమార్తె శ్రీదేవి చెబుతోంది. చాలా కాలంగా తమ కుటుంబాలకు మాటలు లేవని చెప్తున్నారు
Also read
- Somanath Temple: శివయ్య భక్తులకు గుడ్ న్యూస్.. రూ.25లకే సోమనాథుడికి బిల్వ పత్రం సమర్పించి రుద్రాక్షను పొందవచ్చు.. ఎలాగంటే..
- Navagrahas: నవగ్రహ ప్రదక్షిణ చేశాక కాళ్లు కడుక్కోవాలా?.. ఈ పొరపాట్లు చేయకండి..
- Telangana: కొడుకు కాదు.. కాలయముడు.. కాసుల కోసం కన్నతల్లినే కడతేర్చాడు!
- నేటి జాతకములు..2 జూలై, 2025
- చెత్త లారీలో మృతదేహం.. వీడిన మిస్టరీ! షంషుద్దీన్‌తో ఏడాదిన్నరగా వివాహేతర బంధం.. ఆ తర్వాత